Health Tips: కేవలం అరిటాకులోనే కాదు ఈ ఆకుల్లో కూడా భోజనం చేయవచ్చని మీకు తెలుసా!!

|

Sep 02, 2023 | 8:35 PM

పూర్వ కాలాల్లో ఎక్కువగా ఆకుల్లోనే భోజనాలు చేసేవారు. ఆకుల్లో తింటే మంచిదని నిత్యం ఆకుల్లోనే భుజించేవారు. ఇప్పుడు కేవలం పండుగలు లేదా శుభకార్యాల్లో మాత్రమే ఆకుల్లో తింటున్నారు. అది కూడా అరిటి ఆకుల్లోనే. కానీ పాత కాలంలో పలు రకాల ఆకులను ఉపయోగించేవారు. ఉదయం టిఫిన్ మొదలు.. రాత్రి భోజనం వరకు విరివిగా ఆకులను వాడేవారు. కేవలం అరిటాకులో మాత్రమే తినొచ్చని మీరు అనుకుంటున్నారా.. లేదు ఇంకా చాలా ఆకులు ఉన్నాయి. మీకు అరిటాకులు దొరకనప్పుడు వీటిని..

Health Tips: కేవలం అరిటాకులోనే కాదు ఈ ఆకుల్లో కూడా భోజనం చేయవచ్చని మీకు తెలుసా!!
Aritaku Food
Follow us on

పూర్వ కాలాల్లో ఎక్కువగా ఆకుల్లోనే భోజనాలు చేసేవారు. ఆకుల్లో తింటే మంచిదని నిత్యం ఆకుల్లోనే భుజించేవారు. ఇప్పుడు కేవలం పండుగలు లేదా శుభకార్యాల్లో మాత్రమే ఆకుల్లో తింటున్నారు. అది కూడా అరిటి ఆకుల్లోనే. కానీ పాత కాలంలో పలు రకాల ఆకులను ఉపయోగించేవారు. ఉదయం టిఫిన్ మొదలు.. రాత్రి భోజనం వరకు విరివిగా ఆకులను వాడేవారు. కేవలం అరిటాకులో మాత్రమే తినొచ్చని మీరు అనుకుంటున్నారా.. లేదు ఇంకా చాలా ఆకులు ఉన్నాయి. మీకు అరిటాకులు దొరకనప్పుడు వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆకులు ఏంటి? వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరిటి ఆకులు:

భారత దేశంలో అరిటాకుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అరిటి ఆకుల గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అరిటాకులో ఉండే సహజమైన మైనపు పూత ఆహారానికి మరింత టేస్ట్ ని అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్.. జీర్ణ క్రియ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. అంతేకాదు ఇది పర్యావరణానికి హాని చేయకుండా.. తొందరగా మట్టిలో కలిపిపోతుంది. ఇప్పటికీ పలు హోటల్స్ లలో అరిటాకులోనే వడ్డిస్తారు. కాగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అరిటాకులోనే భోజనం చేస్తారు.

ఇవి కూడా చదవండి

తామర ఆకులు:

చాలా ప్రాంతాల్లో తామర ఆకుల్లో భోజనం చేస్తారన్న విషయం మీకు తెలుసా. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో భోజనం చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తామరాకులో ఉండే న్యాచురల్ హైడ్రోఫోబిక్ గుణాలు.. ఆహార్ని ఉపరితలంపై అంటుకోకుండా చూస్తాయి. తామరాకు భోజనానికి మరింత సువాసనను జోడిస్తుంది.

టేకు ఆకులు:

టేకు ఆకులు కూడా ఆహారం తినడానికి సౌకర్యంగా ఉంటాయి. వీటిని కూడా ఆహారం తినడానికి ఉపయోగిస్తారు. బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతాల్లో భోజనానికి ఈ ఆకులనే ఎక్కువగా ఉపయోగిస్తారు. టేకు ఆకుల్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి.. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేస్తాయి.

విస్తరాకులు:

విస్తరాకులు గురించి కూడా అందరికీ తెలుసు. వీటిల్లో భోజనం చేయడం చాలా మంది పవిత్రంగా భావిస్తారు. ఇప్పటికీ చాలా దేవాలయాల్లో విస్తరాకుల్లోనే భోజనాన్ని వడ్డిస్తారు. ఈ ఆకుల్లో భోజనం చేస్తే జీర్ణ క్రియ బాగా జరుగుతుంది. అలాగే ఆకలిని కూడా మెరుగు పరుస్తుంది. ఈ ఆకుల్లో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, బయోయాక్టీవ్ సమ్మెళనాలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి