Acidity Relief Tips: అసిడిటి సమస్య ఉన్నవారు మీ జీవనశైలిలో ఈ మార్పులు చేయండి.. జాగ్రత్తలు పాటిస్తే క్షణాల్లో రిలీఫ్..

|

Aug 02, 2021 | 10:52 AM

అసిడిటి సమస్య చిన్నా, పెద్ద తేడా లేకుండా వేధిస్తుంటుంది. దీని నుంచి బయటపడేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

Acidity Relief Tips: అసిడిటి సమస్య ఉన్నవారు మీ జీవనశైలిలో ఈ మార్పులు చేయండి.. జాగ్రత్తలు పాటిస్తే క్షణాల్లో రిలీఫ్..
Acidity
Follow us on

అసిడిటి సమస్య చిన్నా, పెద్ద తేడా లేకుండా వేధిస్తుంటుంది. దీని నుంచి బయటపడేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా వరకు ఆహారం తీసుకున్న తర్వాత అసిడిటి సమస్య ఎక్కువగా బాధిస్తుంది. కడుపులో ఎక్కువగా ఆమ్లత్వం పెరిగిపోవడంతో ఈ సమస్య ప్రారంభమవుతుంది. అంటే… మసాలా ఆహారం, జంక్ ఫుడ్.. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వలన అసిడిటి వస్తుంది. అయితే చాలా మంది అసిడిటి సమస్య వచ్చిన ప్రతి సారీ టాబ్లెట్స్ తో తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ శాశ్వత పరిష్కరం మాత్రం చూపరు. మీ రోజూ వారీ జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం వలన ఈ సమస్య నుంచి ఉపశమం పొందవచ్చు. అవెంటో తెలుసుకుందామా.

1. మితంగా తినాలి..
ఎక్కువగా తినప్పుడు.. జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో ఆహార వ్యవస్థలో యాడిడ్ పైకి ప్రవహిచండం ప్రారంభమవుతుంది. అదే సమయంలో అసిడిటి సమస్య వేధిస్తుంటుంది. అందుకే ఆహారాన్ని ఒకేసారి తినకుండా కొంచెం కొంచెం తినాలి. ఎక్కువగా తినకూడదు.. ప్రతి సారి తక్కువ మోతాదులో తినాలి.

2. కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి.
కాఫీ, టీ ఎక్కువగా తాగుతుంటే.. మీరు ఆ అలవాటును మార్చుకోవడం మంచిది. దీనివలన యాసిడ్ రిఫ్లక్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. కాఫీ తాగినప్పుడు కడుపులో యాసిడ్ పెరుగుతుంది. అలాగే అది అన్నవాహికలోకి ప్రవహిస్తుంది. కాఫీలోని కెఫిన్ మీ ఎసోఫాగియల్ స్పింక్టర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.

3. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి…
సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాల. దీనివలన జీర్ణవ్యవస్థపై ఎక్కువగా ప్రభావం పడదు. అలాగే యాసిడ్ రిఫ్లక్స్ పనితీరు వేగవంతం అవుతుంది.

4. ఏలకులు తినాలి..
అసిడిటి, కడుపులో మంటగా అనిపించినప్పుడు రెండు ఏలకులు తినాలి. దీంతో తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.

5. తులసి ఆకులను తీసుకోవడం..
అసిడిటీ సమస్యను తగ్గించడంలో తులసి ఆకులు ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇవి అసిటిడీని తొలగించడమే కాకుండా.. మానసకి, అనేక శారీరక వ్యాధులను కూడా దూరం చేస్తాయి. అసిడిటీని తగ్గించడానికి తులసి ఆకుల కషాయాన్ని కూడా తీసుకోవచ్చు.

6. పుదీనా ఆకులను తీసుకోవడం..
పుదీనా ఆకులు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. మసాలా ఆహారాన్ని తిన్న తర్వాత పుదీనా ఆకులను నమలాలి. దీనివలన అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా, ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే ఉపశమనం లభిస్తుంది.

Also Read:

Sukumar: డైరెక్టర్ సుకుమార్ పెద్ద మనసు.. తండ్రి జ్ఞాపకార్థంగా సొంత గ్రామంలో…

Poorna: నయనతార నాకు స్పూర్తి.. ఆమెలా చేయాలని ఉంది.. పూర్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…