Dandruff Home Remedies: చాలా మంది సహజంగా ఎదుర్కొనే సమస్యల్లో చుండ్రు ఒకటి. కలుషిత నీరు, వాయు కాలుష్యం కారణమేదైనా చుండ్రు సాధారణంగా మారిపోతోంది. ఎన్ని రకాల షాంపూలు గట్రా వాడినా చుండ్రు సమస్య నుంచి అంత సులభంగా తగ్గదు. అయితే కొన్ని సహజ చిట్కాలతో చుండ్రుకు చెక్ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా? చుండ్రును తగ్గించే కొన్ని చిట్కాలపై ఓ లుక్కేయండి..
* కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి తలకు అంటుకోవాలి. అనంతరం కొంతసేపు తర్వాత తల స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చుండ్రు నుంచి బయటపడొచ్చు.
* షాంపూలకు దూరంగా ఉంటూ వారంలో కనీసం రెండు సార్లైనా కుంకుడుకాయ లేదా శీకాయతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రుకు చెక్ పెట్టొచ్చు.
* వేడి నీటిలో నిమ్మకాయ రసం పిండి తలకు పట్టించి స్నానం చేసినా మంచి ఫలితం ఉంటుంది.
* గసగసాలను మొత్తగా నూరి పేస్ట్‌లా తయారు చేసుకొని తలకు పట్టించాలి. ఇలా చేసిన గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
* కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని వెంట్రుకలకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
* మందార ఆకులు వెంట్రుకలకు మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. కొన్ని మందార ఆకులను వేడి కొబ్బరినూనెలో కలిపి తలకు రాసుకోవాలి. తర్వాత కొంత సేపటికి తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే సమస్య తగ్గుతుంది.
Also Read: Ayurveda-Turmiric Benefits: సర్వ గుణ సంపన్న ఔషధం పసుపు యొక్క అద్భుతమైన ఆయుర్వేద గుణాలు
Right Time to Drink Milk : పాలు తాగడానికి సరైన సమయం ఉంటుందా..? ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా..!
Madhuri Dixit: యోగాసనాలవలన ఆరోగ్యప్రయోజనాలను వివరిస్తూ వీడియో షేర్ చేసిన మాధురీ దీక్షిత్