Heart attack: హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చాక 90 రోజుల వరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఇక గుండెపోటు వచ్చిన వెంటనే అలర్ట్‌ అయితే ప్రాణాలు సంరక్షించుకోవచ్చు. అయితే గుండెపోటు నుంచి కోలుకున్న వెంటనే పూర్తిగా కోలుకున్నట్లు అర్థం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం, గుండెపోటు గురైన తర్వాత ప్రతీ ఒక్కరూ 90 రోజుల వరకు కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని...

Heart attack: హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చాక 90 రోజుల వరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Heart Stroke

Updated on: Feb 06, 2024 | 8:37 PM

గుండె పోటు సమస్యలు ఇటీవల భారీగా పెరిగిపోతున్నాయి. మారుతోన్న జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువుతున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే హార్ట్‌ స్ట్రోక్‌ బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా భారత దేశంలో గుండె జబ్బుల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. భారతీయులు వ్యాయామం చేయకపోవడం వల్లే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు మొన్నటికి మొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇక గుండెపోటు వచ్చిన వెంటనే అలర్ట్‌ అయితే ప్రాణాలు సంరక్షించుకోవచ్చు. అయితే గుండెపోటు నుంచి కోలుకున్న వెంటనే పూర్తిగా కోలుకున్నట్లు అర్థం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం, గుండెపోటు గురైన తర్వాత ప్రతీ ఒక్కరూ 90 రోజుల వరకు కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని లేదంటే ఇతర తవ్రమైన వ్యాధుల బారినపడే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చి కోలుకున్న తర్వాత కూడా, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.

గుండెపోటుకు సకాలంలో చికిత్స అందించకపోతే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. గుండె సంరక్షణ కోసం, మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గుండెపోటు నుంచి కోలుకున్న వ్యక్తికి రోగనిరోధక శక్తి బలహీనడపడుతుంది. ఈ కాలంలో, గుండెపోటు పునరావృతమయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల, గుండెపోటు వచ్చిన 90 రోజులలోపు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన కొన్ని ప్రత్యేక చిట్కాలు పాటించాలి. ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత మళ్లీ 90 రోజుల్లో మరోసారి గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే 5 ఏళ్లలో ప్రాణాంతక సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

గుండెపోటు వచ్చిన తర్వాత జీవనశైలి కొన్ని మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నూనె వస్తువులకు దూరంగా ఉంటూ ప్రతీ రోజూ వ్యాయామం చేయాలని చెబుతున్నారు. నడక అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ప్రతీ రోజూ 6 నుంచి 9 వేల అడుగులు నడిచే వాళ్లలో హృద్రోగ సమస్యలు 60 శాతానికి తగ్గినట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..