Health Tips: ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు అస్సలు తినకూడదట.. తింటే ప్రమాదమేనంటున్నారు నిపుణులు..!

|

Mar 13, 2021 | 8:16 PM

Health Tips: ప్రతి రోజు ఉదయం అల్పాహారంలో మనం తీసుకునే ఆహారం ఎంతో కీలకమైనది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో ముఖ్యమైనది. అయితే ఎన్ని ఆహార నియమాలు పాటించినా....

Health Tips: ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు అస్సలు తినకూడదట.. తింటే ప్రమాదమేనంటున్నారు నిపుణులు..!
Follow us on

Health Tips: ప్రతి రోజు ఉదయం అల్పాహారంలో మనం తీసుకునే ఆహారం ఎంతో కీలకమైనది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో ముఖ్యమైనది. అయితే ఎన్ని ఆహార నియమాలు పాటించినా.. ఉదయం పూట టిఫిన్‌ చేయాల్సిందేనని డైటిషియన్‌, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉదయం అల్పాహారం మానేయడం అత్యంత ప్రమాదమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగని ఏది పడితే అది తినేస్తే కూడా ప్రమాదమేనంటున్నారు. ఉదయంపూట ఖాళీ కడుపుతో ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మరీ మంచిదంటున్నారు.

సాఫ్ట్ డ్రింక్స్‌ ఉదయం సమయంలోనే కాదు రోజులో ఎప్పుడు కూడా తీసుకోకపోవడమే మంచిదంటున్నారు. ఇందులో co2 అధికంగా ఉంటుంది. చక్కెర స్థాయి శాతం కూడా ఎక్కువ ఉండటం ఉంటుంది. ఇందుకే బరువు తగ్గాలనుకునే వారికి వీటికి దూరంగా ఉండటం బెటర్‌ అని సూచిస్తున్నారు.

ఉదయం లేవగానే కూల్‌డ్రింక్స్‌ వంటివి తాగకూడదు. ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు మాత్రమే తీసుకోవడం మంచిది. అల్లంలో వేడి నీటిని కలుపుకొని తాగితే జీర్ణక్రియ ఎంతగానో మెరుగు పరుస్తుంది. శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

అల్పాహారంలో కారంతో కూడిన పదార్థాలు తయారు చేసినవి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదంటున్నారు నిపుణులు. ఇవి తినడం వల్ల కడుపులో చాలా అసౌకర్యంగా ఉండటమే కాకుండా ఆమ్ల గాఢతను ఎక్కువగా కలిగి ఉండటంతో అది కొద్ది గంటల పాటు మనకు ఇబ్బందికి గురి చేస్తుంది. ఉదయం పూట కారం పదార్థాలను తీసుకోకపోవడం బెటర్‌.

అలాగే ముడి కూరగాయలను ఉడికించి, లేదా అలాగే తినడం మంచిదే కాని ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందంటున్నారు. ఉదయం ఏదైనా తిన్న తర్వాత తింటే ఉపయోగం ఉంటుందట. ఖాళీ కడుపుతో మాత్రం అవి తింటే ఇబ్బంది తప్పదంటున్నారు నిపుణులు.

ఇవీ కూడా చదవండి: రాత్రి సమయంలో భోజనం ఆలస్యంగా చేస్తున్నారా..? అయితే ఈ రోగాలు మీ వెంటే.. జాగ్రత్త ఉండాలంటున్న వైద్యులు

Watermelon: పుచ్చకాయ ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో రోగాలు దూరమవుతాయి.. అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు

Beetroot Juice Benefits: రోజూ పరగడుపునే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుంది..? గర్భిణీలు తాగొచ్చా..?