Fitness Tips: జిమ్ చేయగానే నీరు తాగొచ్చా..? ఆయుర్వేదం చెప్పే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

|

Jun 28, 2022 | 10:19 AM

ఆయుర్వేదం ప్రకారం.. మనం నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదు. ఈ పద్దతిని మానుకోవాలి.. క్రమంగా నీటిని తాగడం మంచిది. దీనివల్ల నీరు మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసి జీవక్రియను పెంచుతుంది.

Fitness Tips: జిమ్ చేయగానే నీరు తాగొచ్చా..? ఆయుర్వేదం చెప్పే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Water
Follow us on

Exercise Fitness Tips: మానవ శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే ఎన్నో సమస్యలను ఉత్పన్నమవుతాయి. డీహైడ్రేషన్ కారణంగా గుండెలో మంట, తలనొప్పి, వెన్నునొప్పి, బలహీనత, నీరసం లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు.. శరీర భాగాల నుంచి నీరు తగ్గిపోతుంటుంది. అటువంటి పరిస్థితిలో శరీరం దాహం రూపంలో సిగ్నల్ ఇస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాం. కానీ అలాంటి పరిస్థితి రాదు. దీని కోసం మనం క్రమం తప్పకుండా నీరు తాగడం అవసరం.

జిమ్ లేదా వర్కౌట్ చేస్తున్నప్పుడు నీరు తాగాలా?

ఆయుర్వేదం ప్రకారం.. మనం నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదు. ఈ పద్దతిని మానుకోవాలి.. క్రమంగా నీటిని తాగడం మంచిది. దీనివల్ల నీరు మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసి జీవక్రియను పెంచుతుంది. అయితే జిమ్ లేదా వర్కవుట్ చేస్తున్నప్పుడు మన శరీరం నుంచి చెమట రూపంలో నీరు బయటకు వచ్చి దాహంగా అనిపిస్తుంది. ఇలా అనిపించినప్పుడు ఈ దాహాన్ని గుర్తుగా భావించి నీళ్లు తాగాలా అనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. అసలు దీనికి సమాధానం తెలియాలంటే జిమ్‌కి వెళ్లిన వెంటనే శరీర పరిస్థితి (వేడి లేదా చల్లగా) ఎలా ఉందో చూడాలి. అదే విధంగా జిమ్ తర్వాత మన శరీరం వెచ్చగా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే నీళ్లు తాగితే అవయవాలు దెబ్బతింటాయి. కావున జిమ్‌కు వెళ్లిన వెంటనే నీరు తాగేటప్పుడు, ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి..

ఇవి కూడా చదవండి
  • జిమ్ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోండి. చెమట పూర్తిగా ఆగిపోయాక నీళ్లు తాగాలి.
  • ఒకే శ్వాసలో ఒక గ్లాసు నీరు తాగడం మంచిది కాదు. దాహం వేసినా వేయకపోయినా.. సిప్స్ చేస్తూ నీళ్లు తాగాలి.
  • నీటిలో కొంచెం ఉప్పు, పంచదార కలపి తాగండి. ఇది చెమటతో విడుదలయ్యే ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. మీరు సాధారణ నీటికి బదులుగా కొబ్బరి నీటిని కూడా తీసుకోవచ్చు.
  • ఎప్పుడూ హాయిగా కూర్చుని నీళ్లు తాగాలి. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
  • జిమ్ తర్వాత 1-2 గంటల పాటు ఫ్రిజ్ వాటర్ తాగడం మానుకోండి.
  • ఎప్పుడూ కూడా నీరు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగడం ఆరోగ్యానికి మంచిది

ఆయుర్వేదం ప్రకారం.. మనం సాధారణ పరిస్థితిలో కూడా చల్లటి నీటికి దూరంగా ఉండాలి. మనం నీటిని మరిగించి లేదా గది ఉష్ణోగ్రత వద్ద తాగడం మంచిది. జిమ్ తర్వాత శరీరంలోని రక్తం వేడిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిల్లో చల్లటి నీరు తాగడం వల్ల హాని జరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..