Health: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇది తాగితే ఆ సమస్యలన్నీ మటాష్…

|

May 19, 2024 | 6:53 PM

అల్లం ఇందరి ఇళ్లలో తప్పకుండా ఉంటుంది. కూరల్లో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఉదయం అల్లం తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు. ఉదయాన్నే అల్లం నీరు తాగితే కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసకుందాం...

Health: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇది తాగితే ఆ సమస్యలన్నీ మటాష్...
Ginger Water
Follow us on

రోజూ మన డైట్‌లో అల్లం భాగం చేసుకోవడం వల్ల ఎన్నో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం మీ టీతో పాటు ఆహారం రుచిని పెంచుతుంది. అయితే మీరు ఎప్పుడైనా అల్లం నీళ్లు తాగారా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి అల్లం నీరు తాగడం సులభమైన మార్గం. ఆయుర్వేదంలో అల్లం ఔషధ గుణాలకు ప్రసిద్ధి. పురాతన వైద్యంలో అల్లం అనేక వ్యాధులను నయం చేయడానికి ఒక మూలికగా ఉపయోగించారన్న విషయం తెలిసిందే కదా..! అల్లంలో శరీరానికి అవసరమైన విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్, క్రోమియం వంటి పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగితే అల్లం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ శరీరానికి అందుతాయి. అవెంటో ఇప్పుడు తెలసుకుందాం…

1. బరువు తగ్గుతారు

ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. మీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది

2. షుగర్ బాధితులకు ప్రయోజనకరం:

ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే, రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది. ఇది మధుమేహం వల్ల వచ్చే సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

3. చర్మానికి మేలు చేస్తుంది:

అల్లం నీరు శరీరంలో పేరుకుపోయిన మురికి, టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ రక్తాన్ని సహజంగా శుద్ధి చేయడంలో యూజ్ అవుతుంది

4. ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు దూరం :

అల్లం శరీరంలోని ఇన్‌ఫ్లమేటరీ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అల్లం వాపును కలిగించే సూక్ష్మజీవులు, హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.

5. పొట్టకు మేలు చేస్తుంది:

ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీని కారణంగా, అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం, వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అదనంగా, అల్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

(NOTE: ఈ కథనం నిపుణుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ఫాలో అయ్యేముందు సంబంధిత డాక్టర్లను సంప్రదించండి)