Female fertility: మహిళల్లో ఇలాంటి సమస్యలు ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయా..?

| Edited By: Ravi Kiran

Dec 06, 2021 | 6:36 AM

Female fertility: ప్రస్తుత కాలంలో సంతానలేమి సమస్య అనేకంగా వేధిస్తోంది. పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నో..

Female fertility: మహిళల్లో ఇలాంటి సమస్యలు ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయా..?
Follow us on

Female fertility: ప్రస్తుత కాలంలో సంతానలేమి సమస్య అనేకంగా వేధిస్తోంది. పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా సంతానం కలుగనివారు ఎంతో మంది ఉన్నారు. ఇందుకు చాలా కారణాలున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితులతో పాటు చాలా సమస్యలు సంతాన లేమికి కారణం అవుతున్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా మహిళల్లో ఉబకాయం, పిట్యుటరీ, థైరాయిడ్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల శుక్రకణాల ఉత్పత్తిపై అధిక ప్రభావం పడి సంతానలేమికి దారితీయవచ్చు. అయితే ఆ సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుతం పెళ్లి అయిన జంటల్లో 7-8 శాతం మందిలో సంతానలేమి సమస్య ఉంటుందని సర్వేలో తేలింది. రెండేళ్ల పాటు సాధారణ లైంగిక జీవనం గడిచినా గర్భం ధరించకుంటే దాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. స్ర్తీ సాధారణ లైంగిక జీవితం గడిపినా ఒకసారి గర్భం ధరించి, పిల్లలు కలిగినా లేదా గర్భస్రావమై రెండవసారి గర్భధారణ జరగకపోవటాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు.

మగవారిలో సంతానలేమికి కారణాలు :

శుక్రకణాలు లేకపోవటం లేదా శుక్రకణాలు ఉత్పత్తి లేకపోవటం, శుక్రకణాలు ఉత్పత్తి అయినపుడు వాటి కదలికలు సాధారణంగా లేకపోవటం, శుక్రకణాల నిర్మాణంలో తేడా వల్ల సంతానం కలిగేందుకు అవకాశాలు చాలా తక్కువ. పిట్యుటరీ, థైరాయిడ్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల శుక్రకణాల ఉత్పత్తిపై ప్రభావం పడి సంతానలేమికి దారితీయవచ్చని అంటున్నారు. అధికబరువు, డయాబెటిస్‌ కూడా సంతానలేమికి కారణం కావచ్చు.

స్త్రీలలో సంతానలేమికి కారణాలు :

స్త్రీ ప్రత్యుత్తి వ్యవస్థలో లోపాలు, చిన్న గర్భసంచి ఉండటం, గర్భసంచి లేకపోవడం, రెండు గదులుగా ఉండే గర్భసంచి, ట్యూబ్స్‌ మూసుకుపోవటం, అండాశయంలో సరైన ఎదుగుదల లేకపోవటం, ఆ మార్గం చిన్నగా ఉండటం, మూసుకుపోయినట్లు ఉండటం, హార్మోన్‌ సమస్యలు కారణం కావచ్చు. అలాగే రుతుక్రమం సరిగ్గా కాలేకపోవడం సంతానలేమికి దారితీయవచ్చు. గర్భసంచిలో కణతులు ఏర్పడి ఫాలోపియన్‌ ట్యూబ్స్‌కు అడ్డు తగలడం, ఫలదీకరణం చెందిన పిండం గర్భసంచిలో స్థావరం ఏర్పడకుండా చేయడం వల్ల సంతానలేమికి దారితీస్తుంది. ఇవేవి కాకుండా ఆరోగ్యవంతులకు కూడా ఆకారణంగా పిల్లలు కలగక పోవటాన్ని ఇడియోపతిక్‌ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు.

ఊబకాయంతో బాధపడుతుంటే..

ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతుంటే.. బ‌రువు త‌గ్గేందుకు ప్రయత్నించాలి. రోజూ వ్యాయామం చేయ‌డంతో పాటు ఆహార‌పు అల‌వాట్లలో మార్పులు చేసుకోవడం మంచిది. ప్రతి రోజు వ్యాయామం చేయ‌డంతో పాటు ధ్యానం చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గుతుంది. దీనివ‌ల్ల అండాల ఉత్పత్తి నాణ్యత మెరుగు పర్చుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. అయితే మీరు 35 ఏళ్ల లేపు వారైతే ఆరు నెలలపాటు పోషకాహారం తీసుకుంటూ ప్రతి రోజు వ్యాయామం చేయడం, సరైన నిద్రపోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఇవి కూడా చదవండి:

Peanuts Side Effects: వేరుశెనగల వారు అస్సలు తినకూడదట.. ఎందుకు దూరంగా ఉండాలో తెలుసా?

Health and Medicine: మలేరియా నివారణ నుంచి కరోనా పై పోరాటం వరకూ ఈ సంవత్సరం వచ్చిన అద్భుత ఆవిష్కరణలు ఏమిటో తెలుసా?