Children’s Food Care: మీ పిల్లలకు రెండు సంవత్సరాలు దాటాయా? ఇలాంటి ఆహారాలు పెడితే.. హెల్దీగా, ఎనర్జిటిక్ గా ఉంటారు!

|

Sep 14, 2023 | 1:14 PM

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అన్ని రకాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెద్దలు కూడా ఆరోగ్య పరంగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంది. తొందరగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా ఉంటేనే వ్యాధులను ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది. పిల్లల్ల విషయంలో కూడా అంతే. మీ పిల్లలు రెండు ఏళ్ల వయసు దాటినట్లైతే వారి పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ఫుడ్ ని ఇవ్వాలి. ఈ వయసు పిల్లు సరిగ్గా ఆహారం తీసుకోరు. దీంతో తొందరగా వ్యాధుల బారిన అవకాశం ఉంది. కాబట్టి వారు తినే ఆహారంలోనే మంచి పోషకాలు..

Childrens Food Care: మీ పిల్లలకు రెండు సంవత్సరాలు దాటాయా? ఇలాంటి ఆహారాలు పెడితే.. హెల్దీగా, ఎనర్జిటిక్ గా ఉంటారు!
Children's Food Care
Follow us on

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అన్ని రకాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెద్దలు కూడా ఆరోగ్య పరంగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంది. తొందరగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా ఉంటేనే వ్యాధులను ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది. పిల్లల్ల విషయంలో కూడా అంతే. మీ పిల్లలు రెండు ఏళ్ల వయసు దాటినట్లైతే వారి పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ఫుడ్ ని ఇవ్వాలి. ఈ వయసు పిల్లు సరిగ్గా ఆహారం తీసుకోరు. దీంతో తొందరగా వ్యాధుల బారిన అవకాశం ఉంది. కాబట్టి వారు తినే ఆహారంలోనే మంచి పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇది తల్లులకు పెద్ద టాస్కే. ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినరు కాబట్టి. రోజంతా ఆడుతూ.. అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. కాబట్టి వారికి మరిన్న పోషకాలు అవసరం.

పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వాలి:

పిల్లలకు ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఉన్న ఆహారం అందించాలి. పెరుగు, జున్ను, చీజ్, పాలు ఇవ్వాలి. పాలతో చేసిన స్వీట్లు అయినా ఇవ్వొచ్చు. కొంత మంది పిల్లలకు పాలు తాగరు. అలాంటి వారికి ఫ్రూట్స్ కలిపి జ్యూస్ ల రూపంలో, మిల్క్ షేక్స్ రూపంలో అందించాలి. అయితే ఒక్కొక్కరి ఇలాంటివి కూడా పడవు. అలర్జీ, దురద వంటివి వస్తాయి. వాటిని గమనించి వెంటనే మానివేయాలి.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్ ఫుడ్:

ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అందించాలి. సీ ఫుడ్స్, బీన్స్, బఠానీలు, నట్స్, సోయా ఉత్పత్తులు, విత్తనాలు చేర్చాలి.

కూరగాయలు, పండ్లు:

రెండు సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు అన్ని రకాల కూరగాయలు, పండ్లు ఇవ్వొచ్చు. కనీసం ప్రతి రోజూ ఒక కప్పు కూరగాయలు, పండ్లు అయినా ఇవ్వాలి. మినరల్స్, విటమిన్స్ బాగా అందుతాయి. ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ మెరుగు పరుస్తాయి. దీని వల్ల పిల్లలు బలంగా ఉంటారు.

తృణధాన్యాలు పెట్టాలి:

ఎదిగే పిల్లలకు కూడా రోజుకు తృణ ధాన్యాలను పెట్టాలి. దీని వల్ల ఫైబర్, మినరల్స్ అందుతాయి. రాగులు, సజ్జలు, ఓట్స్, జొన్నలు, కొర్రలు వారి ఆహారంగా ఇవ్వొచ్చు. దీంతో వాతావరణం మార్పుల వల్ల వచ్చే వాధ్యులు రాకుండా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి