Tulasi Seeds: హిందువులు పవిత్రంగా పూజించే తులసి ఆరోగ్య ప్రదాయని.. అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నదని తెలిసిందే. తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. అదే విధంగా తులసి విత్తనాలు కూడా ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయి. తులసి గింజలను తరచుగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. తులసి గింజల్లో చాలా ప్రోటీన్, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తులసి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ అధికంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దీంతో తరచుగా వచ్చే వ్యాధుల నుంచి తులసి గింజలు రక్షణ కలిపిస్తాయి. ఈరోజు తులసి గింజలను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
*తులసి గింజలను ఎండ బెట్టుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. (ఆయుర్వేద షాప్స్ లో కూడా దొరుకుటుంది) ఈ పౌడర్ ను పాలల్లో కలిపి రోజూ తాగుతుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
*పాలల్లో తులసి గింజల పొడి వేసుకుని తాగితే రక్తనాళాల్లో ఉండే కొవ్వు శాతం తగ్గుతుంది
*తులసి విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరం కొల్లాజెన్‌ను స్రవిస్తుంది. ఇది కొత్త చర్మ కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. చర్మం ముడతలను తులసి గింజలు నివారిస్తాయి. వృద్ధాప్యపు ఛాయలు తగ్గుతాయి.
*ఈ విత్తనాలలో ఐరన్, విటమిన్ కె మరియు ప్రోటీన్ ఉన్నాయి.
*తులసి గింజలను ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మలబద్ధకం యాసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
*తులసి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీటిని తరచుగా తినడం వలనా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు ఈ తులసి విత్తనాలు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు తక్కువచేస్తాయని ఓ పరిశోధనలో వెల్లడైంది.
*శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి.
*తులసి విత్తనాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను అడ్డుకుంటాయి.
*రక్తహీనత సమస్యను తొలగిస్తాయి.
*అధిక బరువు గలవారికి తులసి గింజలు మంచి రెమెడీ.. ఈ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంది. రోజూ పావుకప్పు తులసి విత్తనాలను నీటిలో నానబెట్టుకుని.. వాటిని శుభ్రం చేసుకుని అనంతరం ఈ విత్తనాల్లో కొద్దిగా బెల్లం, పెసరపప్పు కలిపి తింటే.. ఆకలి తగ్గుతుంది.
*తులసి విత్తనాలు మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో మంచి పాత్రను పోషిస్తాయి. అంతేకాదు శారీరకంగా అలసటను దూరం చేస్తాయి.
గమనిక : సబ్జా గింజలు తులసి జాతికి చెందినవి. అందుకే తులసి విత్తనాలు, సబ్జా గింజలు కూడా ఒకేలా ఉంటాయి. కనుక వీటి తేడాను గుర్తించి ఉపయోగించుకోవాలి.