Health: ఎక్కువసేపు ఏసీలో ఉంటే యమ డేంజర్.. అసలు విషయం తెలిస్తే కంగుతింటారు

|

Jul 16, 2022 | 9:48 PM

వేగంగా పెరిగిపోతున్న సాంకేతికతతో ప్రతి ఒక్కరూ ఆధునికతకు అలవాటుపడ్డారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో ఎప్పటికప్పుడు అందుకు అనుగుణంగా తయారవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏసీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది....

Health: ఎక్కువసేపు ఏసీలో ఉంటే యమ డేంజర్.. అసలు విషయం తెలిస్తే కంగుతింటారు
Ac
Follow us on

వేగంగా పెరిగిపోతున్న సాంకేతికతతో ప్రతి ఒక్కరూ ఆధునికతకు అలవాటుపడ్డారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో ఎప్పటికప్పుడు అందుకు అనుగుణంగా తయారవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏసీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతగా అంటే.. ఓ ఐదు నిమిషాలు కూడా ఎండలో నిలబడలేనంతగా.. ఏసీలు పర్యావరణానికి చేసే హానిని విస్మరిస్తూ వాటిని విచ్చలవిడిగా వాడేయడం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి. అయితే.. ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు ఏసీ ఉండటం సాధారణమే. కానీ అదే అలవాటై క్రమంగా బానిసలుగా మార్చేస్తోంది. ఏసీ లేకపోతే ఉండలేనంతగా మన శరీర పనితీరును మారుస్తోంది. ఇంటి వాతావరణాన్ని చల్లబరిచే ఈ ఏసీలు మితిమీరి వాడితే అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీల్లో ఉండటం వల్ల ప్రయోజనాల కంటే, నష్టాలే ఎక్కువగా ఉన్నాయని వార్నింగ్ ఇస్తున్నారు. ఏసీల ద్వారా వ‌చ్చే చల్లదనం సహజసిద్ధమైనది కాకపోవడం వల్ల అనేక శ్వాససంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఏసీ వల్ల బ్లడ్‌లో ఆక్సిజన్ తక్కువై బాడీ త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వచ్చేందుకు కూడా ఏసీ కారణమవుతుందని చాలా మందికి లియ‌దు. అలాగే ఏసీలో ఎక్కువగా ఉండేవారు అధికంగా నీళ్లు తాగకపోతే వాళ్లకు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎక్కువ సమయం ఏసీల్లో గడపటం వల్ల తాజా గాలి అందక వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. చర్మం పొడిబారిపోవడం, విపరీతమైన తలనొప్పి, కళ్లు దురద వంటి స‌మ‌స్యలూ ఎదుర‌వుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీ వాడాల్సి వచ్చినప్పుడు అప్పుడప్పుడూ బయటి వాతావరణంలో గడపాలి. తలుపులు, కిటికీలు తెరచి సహజసిద్ధమైన గాలిని లోపలికి రానిస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ సేపు ఏసీలో ఉండే వారు ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలతో బాధపడతారు. గొంతు పొడిబారడం, ముక్కు శ్లేష్మం త్వరగా ఆరిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమా, అలర్జీలతో బాధపడేవారికి ఏసీ మరింత ప్రమాదం కలిగిస్తుంది. గది ఉష్ణోగ్రతతో పోలిస్తే ఏసీలో ఉండేవారికి డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి లేదా మైగ్రేన్‌ రావచ్చు. ఏసీలో ఉండి వెంటనే ఎండలోకి వెళితే తలనొప్పి వస్తుంది. కళ్లు పొడిబారడం అనే సమస్య ఉంటే ఎక్కువ సేపు ఏసీలో ఉండడం అస్సలు మంచిది కాదు. ఏసీలో ఎక్కువ సేపు కూర్చునేవారిలో దురద లేదా పొడి చర్మం సమస్య చాలా సాధారణం. వారు ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల పొడి చర్మం సమస్య పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే..వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.