Health: ముక్క లేనిదే ముద్ద దిగట్లేదా.. రుచిగా ఉందని చికెన్ ను లాగించేస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే..

|

Aug 13, 2022 | 9:02 PM

నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో చికెన్ (Chicken) ముందు వరసలో ఉంటుంది. నాన్‌వెజ్‌ ప్రియుల్లో చికెన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. చికెన్‌తో చేసిన ఏ పదార్థం అయినా ఇష్టంగా లాగించేస్తారు. ఇంట్లో చేసుకునే వంటకాల నుంచి బయటి...

Health: ముక్క లేనిదే ముద్ద దిగట్లేదా.. రుచిగా ఉందని చికెన్ ను లాగించేస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే..
Chicken
Follow us on

నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో చికెన్ (Chicken) ముందు వరసలో ఉంటుంది. నాన్‌వెజ్‌ ప్రియుల్లో చికెన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. చికెన్‌తో చేసిన ఏ పదార్థం అయినా ఇష్టంగా లాగించేస్తారు. ఇంట్లో చేసుకునే వంటకాల నుంచి బయటి హోటల్, రెస్టారెంట్ల వరకు చికెన్ దే అగ్రస్థానం. నాన్ వెజ్ ప్రియుల జిహ్వచాపల్యం తీర్చేందుకు చికెన్ లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గ్రిల్ చికెన్, గోంగూర చికెన్, చికెన్ బిర్యాని, చికెన్ టిక్కా, హండీ చికెన్, కడాయి చికెన్, మొగలాయి చికెన్, చెట్టినాడ్ చికెన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందండోయ్.. చికెన్ తినడం వల్ల ఆరోగ్యాన్ని ప్రయోజనమే అయినప్పటికీ అధికంగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు (Health Experts) చెబుతున్నారు. చికెన్‌లో ఉండే ప్రొటీన్‌, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. కండరాల పెరుగుదలకు చికెన్ బెస్ట్ ఫుడ్ గా చెప్పవచ్చు. అయితే చికెన్‌ ఎక్కువగా తింటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ చికెన్ తినడం వల్ల, చికెన్ కొనేటప్పుడూ, వండేటప్పుడూ జాగ్రత్త అవసరమని వివరిస్తున్నారు. చికెన్ లో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్ దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఓ అధ్యయనం ప్రకారం చికెన్‌ ఎక్కువగా తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ లెవెల్స్ పెరుగుతాయని తేలింది. ఫలితంగా గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే ప్రతిరోజూ చికెన్‌ తినడం వల్ల బరువు పెరిగే ఆస్కారం ఉందని, ఫుడ్ డైట్ మెయింటేనే చేసే వారు చికెన్ తక్కువగా తీసుకోవడమే మంచిదని చెప్పారు. డైరీ ప్రొడక్ట్స్, రెడ్‌ మీట్‌, చికెన్‌ స్కిన్‌‌లో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తక్కువగా, కావాల్సినంత మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం