Health: వండిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఎన్ని రోజులు నిల్వ చేస్తున్నారు.. ఈ షాకింగ్ విషయాలు మీకోసం..

బిజీ లైఫ్ కారణంగా మనలో చాలా మంది ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని ఒకేసారి వండుకోవడం, కూరగాయలను కట్ చేసి పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. వాటిని రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేస్తారు. వాటిని అవసరానికి తగినట్లు ఉపయోగించుకుంటారు....

Health: వండిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఎన్ని రోజులు నిల్వ చేస్తున్నారు.. ఈ షాకింగ్ విషయాలు మీకోసం..
Refrigerator Health

Updated on: Jan 10, 2023 | 5:32 PM

బిజీ లైఫ్ కారణంగా మనలో చాలా మంది ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని ఒకేసారి వండుకోవడం, కూరగాయలను కట్ చేసి పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. వాటిని రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేస్తారు. వాటిని అవసరానికి తగినట్లు ఉపయోగించుకుంటారు. అయితే.. ఇలా తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో ఉంచకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు అది పోషకాలను కోల్పోతుందని చెబుతున్నారు. అయితే.. నీటిలో కరిగే విటమిన్లు వంట చేసే సమయంలోనే చాలా వరకు కోల్పోతాయి. శీతలీకరణలో కాదని గుర్తించారు. గాలి చొరబడని కంటైనర్‌లో.. నిల్వ చేసిన ఆహారం 2 నుంచి 3 రోజులు.. గరిష్ఠంగా ఒక వారం వరకు ఉంటుంది. ఎందుకంటే జీవసంబంధ కార్యకలాపాలు ఉష్ణోగ్రతతో మందగిస్తాయి కాబట్టి అత్యంత శీతల ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు మనుగడ సాగించలేవు. తక్కువ ఉష్ణోగ్రతలను ఇష్టపడని బ్యాక్టీరియాతో అప్పుడప్పుడు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ఒకటి నుంచి రెండు రోజుల్లోగా ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

మాంసం, పౌల్ట్రీ, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి పాడైపోయే ఆహారాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. వాటిని ఒక వారంలోపు ఉపయోగించుకోవాలి. బ్రెడ్, పండ్లు, కూరగాయలను కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. పరిమితి దాటిన తర్వాత ఆ ఆహారాన్ని ఉపయోగించకపోవడం మంచిది. లేదంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి.. అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. బ్యాక్టీరియా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

గాలి చొరబడని కంటైనర్లలో మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేయాలి. రిఫ్రిజిరేటర్ అల్మారాలు చాలా గాలి, శీతలీకరణను అందుకుంటాయి. కాబట్టి మిగిలిపోయిన వాటిని అక్కడ ఉంచాలి. ముందుగా పెట్టిన ఆహారాన్ని తప్పకుండా తినాలి. ఆహారం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. వాసన, రంగు, రుచి.. ఆహారం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుపుతాయి. ఏది ఏమైనా.. ఎప్పటికప్పుడు.. తాజా తాజాగా వండుకున్న ఆహారాన్ని తినడమే మంచిది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొ న్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..