AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breastfeeding: తల్లిపాలతో ప్రయోజనం ఏమిటి..? పిల్లలకు ఎంత కాలం పాలిస్తే మంచిది..!

Breastfeeding: అమ్మపాలు అమృతం అంటుంటారు. తల్లిపాలతోనే శిశువుకు ఆరోగ్యం. శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి సి..

Breastfeeding: తల్లిపాలతో ప్రయోజనం ఏమిటి..? పిల్లలకు ఎంత కాలం పాలిస్తే మంచిది..!
Subhash Goud
|

Updated on: Feb 27, 2022 | 5:13 PM

Share

Breastfeeding: అమ్మపాలు అమృతం అంటుంటారు. తల్లిపాలతోనే శిశువుకు ఆరోగ్యం. శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. అయితే తల్లి పాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయి. తల్లి పాల వల్ల బిడ్డకు ఎంతో ప్రయోజనం ఉంది. పిల్లలకు (Babies) ఐదేళ్ల వరకు తల్లిపాలు పట్టిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు. శిశువులు తాగినంత కాలం, తల్లి ఇవ్వగలిగినంత కాలం తల్లిపాలు పట్టించవచ్చని నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) చెబుతోంది.

శిశువుకు మొదటి ఆరు నెలల వరకు..

అయితే తల్లిపాలను పిల్లలకు ఏ వయసులో నిలిపివేయాలన్న దానిపై ఎన్‌హెచ్‌ఎస్‌ ఎలాంటి నిర్ధష్ట సూచనలు చేయలేదు. శిశువుకు మొదటి ఆరు నెలలు ఇతర ద్రవ, ఘన పదార్థాలు ఏవీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత నుంచి ఆరోగ్య కారణాల దృష్ట్యా తల్లిపాలతో పాటు ఘన పదార్థాలు తినిపించాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

తల్లిపాలతో ఇన్ఫెక్షన్లు దూరం..

పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువు ఇన్‌ఫెక్షన్ల నుంచి, రక్షణ డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యల దూరం రక్షించుకోవచ్చు. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. శిశువు రెండో సంవత్సరంలోకి వచ్చాక, తల్లిపాలు ఇవ్వడంతోపాటు ఘన పదార్థాలు తినిపించడం మంచిదని ఎన్‌హెచ్‌ఎస్ వెబ్‌సైట్ చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది..?

రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. రెండు సంవత్సరాల తర్వాత కూడా తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు పోషకాలపరంగా అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెప్పలేమని, ఇలా చెప్పేందుకు ఆధారాలు పరిమితంగా ఉన్నాయని లండన్‌లోని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్’కు చెందిన వైద్యులు చెబుతున్నారు. రెండు సంవత్సరాలు వచ్చేసరికి శిశువుకు కావాల్సిన పోషకాలు శిశువు తీసుకొనే ఇతర ఆహారంతో అందాలని వెల్లడిస్తున్నారు. పాలు పట్టించడాన్ని కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయాన్ని చాలా అంశాల ప్రాతిపదికగా మహిళలు నిర్ణయించుకుంటారు. పాలు ఇవ్వడంలో సౌకర్యం, అసౌకర్యం, కుటుంబ సభ్యులు, తిరిగి ఉద్యోగ విధుల్లో చేరాల్సి ఉండటం, తదితర కారణాలను బట్టి వారు నిర్ణయానికి వస్తారు. బ్రిటన్‌లో శిశువు పుట్టాక దాదాపు 80 శాతం మంది మహిళలు కొన్ని వారాలపాటు పాలు ఇస్తారు. తర్వాత చాలా మంది ఆపేస్తారు.

(గమనిక: ఇందులోని అంశాలు అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనలు, వివిధ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

ఇవి కూడా చదవండి:

Health Tips: తియ్యనైన రుచి మాత్రమే కాదు.. ఖర్జూరంతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..

Health Tips: గురకే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ రిస్క్ ఉందని మీరు కనీసం గెస్ కూడా చేయలేరు