
మారుతున్న జీవనశైలి కారణంగా ఆహార అలవాట్లల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నేటి యువత జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటున్నారు. అయితే వీటిని తినడం తాత్కాలిక ప్రయోజనం బాగానే ఉన్నా ధీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ లేదా అధిక కొవ్వు ఉన్న పదార్థాలను తింటే మెదడు పనితీరు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక కొవ్వు లేదా అధిక క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే కొద్దిరోజుల తర్వాత మెదడు ప్రతిస్పందించడానికి, క్యాలరీలను సమతుల్యం చేయడానికి ఆహారాన్ని తీసుకోవడాన్ని నియంత్రిస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మెదడు, జీర్ణ వ్యవస్థ మధ్య సిగ్నలింగ్ మార్గాన్ని నియంత్రించే ఆస్ట్రోసైట్స్ అనే కణాల ద్వారా క్యాలరీలు తీసుకోవడాన్ని స్వల్పకాలికంగా మెదడు నియంత్రిస్తుంది. అయితే అదే పనిగా జంక్ ఫుడ్స్, కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తింటే నిరంతరం ఈ సిగ్నలింగ్ మార్గానికి అంతరాయం కలిగిస్తుందని పేర్కొంటున్నారు.
ఇటీవల పరిశోధనల్లో ఆస్ట్రోసైట్ లు అధిక క్యాలరీలు తీసుకోవడాన్ని స్వల్పకాలికంగా నియంత్రిస్తున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా అధికంగా ఆహారం తీసుకున్న మూడు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ పరిస్థితి వస్తుందని తేలింది. సాధారణంగా ఆస్ట్రోసైట్స్ ఆహారాన్ని తీసుకోవడంలో మంచి పాత్ర పోషిస్తాయి. అయితే అదే పనిగా కొవ్వు పదార్థాలు తీసుకుంటే మాత్రం వాటి గ్రహనశీలతను కోల్పోతాయి. సమారు 10-14 రోజుల పాటు జంక్ ఫుడ్స్ తింటే ఆస్ట్రోసైట్స్ స్పందించడంలో విఫలమైనట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే మెదడు సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆస్ట్రోసైట్లు మొదట్లో ప్రతిస్పందిస్తాయి. టి క్రియాశీలత నాడీ కణాలను ఉత్తేజపరిచే గ్లియోట్రాన్స్‌మిటర్లు, రసాయనాల విడుదలను ప్రేరేపిస్తుంది. అలాగే కడుపు ఎలా పని చేయాలో నియంత్రించే న్యూరాన్‌లను ఉత్తేజపరిచేందుకు సాధారణ సిగ్నలింగ్ మార్గాలను తెరుస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ గుండా వెళ్లే ఆహారానికి ప్రతిస్పందనగా కడుపు నింపడానికి, ఖాళీ చేయడానికి సరిగ్గా సంకోచించడాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ జంక్ ఫుడ్స్ తినడాన్ని నియంత్రించాలని వైద్యు నిపుణులు సూచిస్తున్నారు.
సిగ్నలింగ్ రసాయనాల తగ్గుదల జీర్ణక్రియలో జాప్యానికి దారితీస్తుంది. ఎందుకంటే తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండకపోవడంతో ఖాళీగా ఉంటుంది. ఒకటి, మూడు, ఐదు, 14 రోజుల పాటు జంక్ ఫుడ్స్ అందించిన ఎలుకలు ఎలా ప్రతిస్పందిస్తాయో? అని చేసిన పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మెదడు వ్యవస్థలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆస్ట్రోసైట్లను ప్రత్యేకంగా నిరోధించడానికి ఎలుకల ప్రవర్తన, వ్యక్తిగత న్యూరాన్లు ఎలా స్పందిస్తాయో అని విషయాలపై పరిశోధనలు చేస్తే ఈ విషయాలు తెలిశాయి. అయితే ఇవి మనిషి ఆరోగ్యంలో ఎలా ప్రతిస్పందిస్తాయో? తెలియడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. అయితే ఈ పరిశోధనల్లో మాత్రం జంక్ ఫుడ్స్ తింటే కచ్చితంగా మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని తేలిందని కాబట్టి అలాంటి ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..