Gym Tips: జిమ్‌లో కుస్తీలు పడుతున్నారా.? వర్కవుట్స్‌ తర్వాత ఈ పనిచేయకపోతే మీ పని అంతే..

|

Jan 13, 2023 | 7:21 AM

ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. చాలా మంది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని ఆశిస్తున్నారు. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు మాత్రమే జిమ్‌కు వెళ్తూ బాడీ బిల్డింగ్ చేసేవారు కానీ ఇప్పుడు సామాన్యులు సైతం బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఏకంగా సిక్స్‌ ప్యాక్‌లు చేస్తున్నారు...

Gym Tips: జిమ్‌లో కుస్తీలు పడుతున్నారా.? వర్కవుట్స్‌ తర్వాత ఈ పనిచేయకపోతే మీ పని అంతే..
Gym Tips
Follow us on

ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. చాలా మంది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని ఆశిస్తున్నారు. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు మాత్రమే జిమ్‌కు వెళ్తూ బాడీ బిల్డింగ్ చేసేవారు కానీ ఇప్పుడు సామాన్యులు సైతం బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఏకంగా సిక్స్‌ ప్యాక్‌లు చేస్తున్నారు. అయితే వర్కవుట్స్‌ చేసే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హెవీ వర్కవుట్స్‌ చేసే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. సహజంగా హెవీ వర్కవుట్స్‌ చేస్తే.. శరీరం ఎక్కువ కేలరీలని బర్న్‌ చేస్తుంది. ముఖ్యంగా కండరాలు మొత్తం అలసిపోతాయి. వాటికి తిరిగి శక్తిని అందించడం ముఖ్యం.

అందుకే వర్కవుట్స్‌ చేసిన తర్వాత తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబున్నారు. పోస్ట్‌ వర్కవుట్‌లో కచ్చితంగా డైట్‌లో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ పౌడర్‌లకంటే సహజంగా లభించే డ్రై ఫ్రూట్స్‌ బెస్ట్ అని సలహా ఇస్తున్నారు. వర్కౌట్ తర్వాత భోజనంలో కొన్ని సూపర్‌ఫుడ్‌లు లేదా కొన్ని సీజనల్ పండ్లు, కూరగాయలను చేర్చడం వల్ల కండరాల పునరుద్ధరణ జరుగుతుంది. వ్యాయామం చేసే వారు కచ్చితంగా బాదం తీసుకోవాలని చెబుతున్నారు. దీని వల్ల రక్తంలో మంచి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఇది శరీరం కండరాల పునరుద్ధరణ ప్రక్రియను పెంచడంలో సహాయపడుతుంది.

ఇక కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతిరోజూ 57 గ్రాముల బాదంపప్పును నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. వీటిలో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, అవసరమైన ఖనిజాలు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. బాదంపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..