Health Tips: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త..

|

Aug 27, 2022 | 9:58 AM

ఉప్పు శరీరానికి అవసరమైన దానికంటే అధికంగా తింటే అది మీ శరీరానికి తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఉప్పు ఎక్కువగా తింటే..

Health Tips: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త..
Salt
Follow us on

Eating too much Salt: ఎక్కువ ఉప్పు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది. మీకు కూడా ఆహారంలో ఎక్కువగా ఉప్పు తినే అలవాటు మానుకోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే.. ఈ అలవాటు సమస్యలను సృష్టిస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం ఎంత ప్రమాదకరమో ఇటీవల పలు పరిశోధనలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. ఉప్పు శరీరానికి అవసరమైన దానికంటే అధికంగా తింటే అది మీ శరీరానికి తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఉప్పు ఎక్కువగా తింటే.. రక్తపోటుతోపాటు గుండెపోటు, కిడ్నీలు, కంటి, మానసిక సమస్యలు పెరుగుతాయి. వాస్తవానికి శరీరంలో ఉప్పు ఎక్కువైతే.. పలు సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మీకు కూడా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు.

తరచుగా మూత్రవిసర్జన: తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేది ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారనడానికి కీలక సంకేతం. ఎక్కువ సమయం మూత్ర విసర్జన చేయడానికి కేటాయించినా.. లేక మూత్రానికి తరచూ వెళ్తున్నా ఈ లక్షణమే.. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల UTI (మూత్ర సమస్యలు), టైప్ 2 డయాబెటిస్, మూత్రాశయ సమస్యలు పెరుగుతాయి.

నిరంతర దాహం: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచూ దాహం వేస్తుంది. సోడియం కంటెంట్ ఉన్న ఆహారాలు మీ శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీన్ని భర్తీ చేయడానికి ఉత్తమ మార్గం నీరు ఎక్కువ తాగటం.

ఇవి కూడా చదవండి

శరీరంలో వాపు: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో వాపు వస్తుంది. మీరు ఉదయం ఉబ్బరంగా అనిపించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. వేళ్లు, చీలమండల చుట్టూ వాపును అనుభవించవచ్చు. శరీరంలోని అదనపు ద్రవం వల్ల ఈ వాపు ఏర్పడుతుంది. దీనిని ఎడెమా అంటారు.

ఆహారంపై శ్రద్ధవహించాలి: మీ ఆహారంలో ఎప్పటికప్పుడు ఎక్కువ ఉప్పు కలపాలని మీకు అనిపిస్తుందా? లేకపోతే ఆహారం బోరింగ్‌గా అనిపిస్తుందా? అయితే.. మీరు ఎక్కువగా ఉప్పు తినడం అలవాటు చేసుకున్నందున ఇలాంటి కారణాలే కనిపిస్తాయి. కాలక్రమేణా ఈ పద్దతిని మార్చుకోవాలి. రుచికి అనుగుణంగా ఆహారంలో సరిపడేంతా ఉప్పును మాత్రమే కలపాలి. లేకపోతే పలు సమస్యలు చుట్టుముడతాయి.

తరచుగా తలనొప్పి: తరచుగా తేలికపాటి తలనొప్పి వచ్చినా అప్రమత్తవ్వాలి. డీహైడ్రేషన్ వల్ల ఈ తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉప్పు తీసుకోవడం వల్ల తక్కువ సమయంలో తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి నుంచి విముక్తి పొందడానికి పుష్కలంగా నీరు తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..