Ice Cream: ఐస్‌క్రీము తింటున్నారా.. అయితే జాగ్రత్త.. అందులో ఉండే ఆ లిక్విడ్ ప్రాణాలకే ప్రమాదం..!

|

Mar 05, 2022 | 10:50 AM

చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఐస్ క్రీమును ఇష్టపడతారు. ఈ ఐస్ క్రీములు(Ice Cream) ఇష్టపడని వారు దాదాపు ఉండరనే చెప్పాలి...

Ice Cream: ఐస్‌క్రీము తింటున్నారా.. అయితే జాగ్రత్త.. అందులో ఉండే ఆ లిక్విడ్ ప్రాణాలకే ప్రమాదం..!
Ice Cream
Follow us on

చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఐస్ క్రీమును ఇష్టపడతారు. ఈ ఐస్ క్రీములు(Ice Cream) ఇష్టపడని వారు దాదాపు ఉండరనే చెప్పాలి. అంత రుచికరంగా ఉంటాయి. కానీ ఇవి మనకు అంత మంచివి కావని నిపుణలు చెబుతున్నారు. వీటిని తయారు చేయడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రమాదరకమైన ద్రావకాన్ని తయారీ దారులు వాడుతారట. ఆ ద్రావకం మరేంటో కాదు. అది ‘లిక్విడ్ నైట్రోజన్'(Liquid Nitrogen). ఇక ఈ లిక్విడ్ నైట్రోజన్‌ను చాలా తక్కువ ఉష్టోగ్రత (Temperature) వద్ద మాత్రమే ఉపయోగిస్తారట. ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రిజర్లో నిల్వ ఉండేందు ఈ ద్రావనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఆహారాల్లో 1800 సంవత్సరం నుంచి ఉపయోగించడం స్టార్ట్ చేశారు. ఇక ఈ ద్రావనానికి రంగు ఇంకా అలాగే వాసన అనేవి అసలు ఉండవు. అలాగే మరొక ముఖ్యమైంది ఏంటంటే.. ఇది చాలా ఫాస్ట్‌గా కూడా ఘనీభవిస్తుంది. అందుకే ఈ లిక్విడ్ నైట్రోజన్‌ను ఐస్ క్రీముల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగేలిక్విడ్ నైట్రోజన్‌ను Desserts ఇంకా అలాగే cocktails లు తెల్లగా పొగలు కక్కేలా అలాగే కూల్ గా చేయడానికి కూడా వీటిని ఎక్కువగా వాడుతుంటారు.

ముఖ్యంగా వీటిని బార్‌లు ఇంకా అలాగే అనేక రకాల రెస్టారెంట్లలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక American Food and Drug Administration ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..నైట్రోజన్ ద్రవం కలిపిన ఆహారం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని స్పష్టమవ్వడం జరిగింది. ఇక ఈ లిక్విడ్ నైట్రోజన్ కలిపిన ఆహారాన్ని చాలా ఎక్కువగా తినడం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి బాగా దెబ్బతింటాయట. అలాగే ఇది చర్మానికి కూడా చాలా హాని అనేది కలిగిస్తుంది. లిక్విడ్ నైట్రోజన్ నుంచి ఆవిరిని కనుక పీల్చితే శ్వాస సంబంధ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయట. ముఖ్యంగా ఇది ఆస్తమా సమస్య ఉన్న వారికి చాలా ప్రమాదకరమైంది. ఇక ఆ ద్రావనం వల్లే ఆహారాలు పొగలు అనేవి కక్కుతాయి. ఇక వాటిని మనం పొగలు కక్కుతున్నప్పుడే తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ అమెరికా ఆహార సంస్థ హెచ్చరిస్తోంది.

గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురించబడింది. మీకు ఏమైనా అనుమానాలు ఉండే పౌష్ఠికాహార నిపుణులు, డాక్టర్ల సలహా తీసుకోండి.

Read Also..  Weight Loss Tips: నిద్రతో అధిక బరువుకు చెక్!.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడి..