Eating Habits For Weight Loss: ఆధునిక కాలంలో చాలామంది అధిక బరువు (ఊబకాయం) తో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బరువు తగ్గేందుకు ఏవేవో కసరత్తులు చేస్తుంటారు. అయితే.. బరువు తగ్గడానికి క్రాష్ డైటింగ్, తీవ్రమైన వ్యాయామం చేయవలసిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు.. కొన్ని ఆహారపు అలవాట్లతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. బరువు తగ్గించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే దానిని సరిగ్గా తినడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటాం.. కానీ ఆహారపు అలవాట్లను మార్చుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం కష్టపడినా బరువు తగ్గలేరని పేర్కొంటున్నారు. అయితే.. తినేటప్పుడు ఈ అలవాట్లను మార్చుకోవడం ద్వారా బరువు ఈజీగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
చిన్న పాత్రలలో తినండి: బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ చిన్న పాత్రలలో ఆహారాన్ని తినాలి. దీనివల్ల తక్కువ తినడంతోపాటు నెమ్మదిగా తింటారు. ఇలా చేయడం కోసం చిన్న గిన్నెలు, ప్లేట్లు ఉపయోగించాలి.
టీవీ చూస్తూ భోజనం చేయవద్దు: టీవీ చూస్తూ ఆహారం తినేవారికి తాము ఎంతమేర తింటున్నామో తెలియదు. టీవీ, ఫోన్ అలవాటు లేకుండా భోజనం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని కారణంగా ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి. తక్కువ తినడం వల్ల బరువు తగ్గుతుంది.
నిదానంగా తినండి: కొందరు తొందర తొందరగా తింటుంటారు. ఇలా తినేవారు ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా తింటారు. ముందుగానే ఆహారం తీసుకోవడం ద్వారా, కడుపు ఇంకా నిండలేదని, ఎక్కువ తినాలని మెదడుకు సిగ్నల్ వస్తుంది. దీనివల్ల బరువు పెరగుతారు. అందుకే ఎప్పుడూ నిదానంగా ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
బాగా నమిలి తినండి: కొంతమంది తొందరతొందరగా ఆహారాన్ని మింగుతారు. దీనివల్ల ఆహారం శరీర భాగాలకు సరిగా అందక స్థూలకాయం పెరుగుతుంది. ఆహారాన్ని ఎప్పుడూ బాగా నమలాలి. దీని వల్ల మీరు తక్కువ తింటారు, బరువు కూడా తగ్గుతారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..