Metro Journey: మెట్రో ప్రయాణం ఇప్పుడు ప్రజల జీవితంలో భాగమైపోయింది. పరుగులు పెడుతోన్న ఈ పోటీ ప్రపంచంలో త్వరగా గమ్యస్థానాలకు చేరాలంటే చాలామంది మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తారు. ఈ జర్నీలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు. అందుకే చాలామంది దూరప్రాంతాలకు వెళ్లేవారు మెట్రోనే ఎంచుకుంటారు. రద్దీగా ఉండి సీటు దొరక్కపోయినా అందులోనే నిల్చొని ప్రయాణం చేస్తుంటారు. ఇలా మెట్రోలో ప్రయాణించడం వల్ల సమయం అలాగే డబ్బు ఆదా కావచ్చు. కానీ ఈ జర్నీతోనూ కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మధ్య వయస్కుల వారు మెట్రో జర్నీలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.
ప్రతిరోజూ ఎక్కువ సేపు నిలబడి దూర ప్రయాణాలు చేయడం ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా సీటు దొరకనప్పుడు ఒకే పోజిషన్‌లో నిలబడి ప్రయాణించడం వల్ల పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలాగే కొంతమంది కొంత మంది బరువైన బ్యాగులను భుజాలపై వేసుకుని ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ఇది ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు కూడా రావొచ్చు. అయితే కొన్ని సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అదంటేంటే నిలబడి ఉన్నప్పుడు పొజిషన్ మార్చుతూ ఉండాలి. అలాగే బ్యాగ్‌లను నేలపై ఉంచి జర్నీ చేయాలి.
గుండె సమస్యలతో పాటు..
కాగా నిత్యం రద్దీ జనాలు, గుంపుల్లో ప్రయాణాలు చేసేవారు త్వరగా అలసిపోతారు. ఒత్తిడికి గురువుతుంటారు. ఇది క్రమంగా మానసిక ఆరోగ్యానికి దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. రద్దీగా ఉండే మెట్రోలో ప్రయాణించడం వల్ల శరీరంలో సెరోటోనిన్ స్థాయులు పెరుగుతాయి. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపతుంది. ఈ సమస్యలను అధిగమించాలంటే ఒత్తిడికి గురైనప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. అలాగే మనసుకు నచ్చిన పనులు చేస్తూ బిజీగా ఉండండి. కాగా ఈ పొరపాట్ల వల్ల చాలామందిలో రక్తపోటు పెరగడం లేదా తగ్గడం మొదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..