Water: తిన్న వెంటనే నీరు తాగుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

|

Apr 18, 2022 | 6:00 AM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం(Food) ఎంతో ముఖ్యమో.. నీరు(water) కూడా అంతే ముఖ్యం. నీరు సరిగా తాగకుంటే రోగాల బారిన పడక తప్పదు..

Water: తిన్న వెంటనే నీరు తాగుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..
water
Follow us on

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం(Food) ఎంతో ముఖ్యమో.. నీరు(water) కూడా అంతే ముఖ్యం. నీరు సరిగా తాగకుంటే రోగాల బారిన పడక తప్పదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు లిటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీళ్లు తాగమన్నారు కదా అని అన్నం తినే ముందు, అన్నం తిన్న తర్వాత నీరు తాగితే చాలా సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. తిన్నవెంటనే నీళ్లను తాగితే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి అనారోగ్య(Health Issues) సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిన్నారు. అయితే చిన్న పిల్లలు మాత్రం తిన్నవెంటనే నీళ్లను తాగొచ్చు. కానీ పెద్దవారు మాత్రం తిన్నాక ఎట్టి పరిస్థితిలో నీళ్లను తాగకూడదని సూచిస్తున్నారు.

ముఖ్యంగా తినడానికి అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికి సుమారుగా రెండు గంటలు పడుతుంది. ఆ సమయంలో మీరు నీళ్లను తాగితే జీర్ణక్రియపై ప్రభావం పడి అజీర్థి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఆహారం తీసుకున్న గంట తర్వాతనే నీళ్లను తాగితే మీ వెయిట్ నియంత్రణలో ఉంటుందట. తిన్న 45 నిమిషాల తర్వాత నీళ్లను తాగితే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని వివరిస్తున్నారు.

సరైన సమయంలో నీళ్లను తాగితే ఎసిడీటీ, గ్యాస్ట్రిక్, కడుపులో నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయట. తిన్న గంట తర్వాత నీళ్లను తాగితే మనం తిన్న పోషకవిలువలన్నీ శరీరంలో బాగా కలిసిపోతాయని నిపుణులు వివరిస్తున్నారు. తిన్న వెంటనే నీళ్లను తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఊబకాయం బారిన పడతారు. జీర్ణ సమస్యలు వస్తాయి

గమనిక:- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Health News: మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువ.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!