ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. టైమ్ కాని టైమ్ లో తినడం, ఉద్యోగాలు, పని ఒత్తిడి ఇలా చాలా కారణాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. ఈ సమస్య చాలా మందిని వేధిస్తోంది. బరువు తగ్గడమంటే.. అనుకున్నంత ఈజీ కాదు. మంచి ఫుడ్ తో పాటు సరైన వ్యాయామాలు కూడా చేయాలి. అలాగే ప్రతి రోజూ ఉదయం వాకింగ్ చేయడం కూడా బెటర్. అధిక బరువును తగ్గించేందుకు ఇప్పటికే ఎన్నో రకాల టిప్స్ ను తెలుసుకున్నాం. ఇప్పుడు మరో టిప్ తో అధిక బరువుకు బైబై చెప్పవచ్చు. కానీ ఏదైనా సరే వెంటనే ఫలితం మాత్రం రాదు. సమయం పడుతుంది.
మనలో చాలా మందికి కాఫీ అంటే ప్రాణం. ఉదయం కప్పు కాఫీ తాగనిదే ఏ పనీ మొదలవదు. అలాంటి మనకు ఎంతో ఇష్టమైన కాఫీతోనే ఈజీగా బరువు తగ్గొచ్చు. మీరు విన్నది నిజమే.. కాఫీ తాగుతూ బరువును కూడా తగ్గవచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం. కాఫీలో ఉండే కెఫిన్ బద్ధకాన్ని పోగొట్టి, శరీరాన్ని ఉత్తేజపరి చేందుకు చాలా హెల్ప్ అవుతుంది. కొందరు పాలు, పంచదారతో కాఫీ తాగితే.. మరికొందరు పాలు లేని, పంచదార లేని కాఫీని ఇష్టపడతారు. అయితే బరువు తగ్గడానికి రోజు వారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన కాఫీలు యాడ్ చేసుకోవాలి. బరువు అదుపులో ఉండాలంటే ఎలాంటి కాఫీ తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ కాఫీ:
సగం నిమ్మకాయ రసాన్ని ఒక కప్పు కాఫీలో కలుపుకుని తాగడం వల్ల బరువు నియంత్రణకు సహాయ పడుతుంది. ఈ మిశ్రమంలోని కెఫిన్, సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి జీవక్రియను పెంచడానికి, కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడతాయి.
బ్లాక్ కాఫీ:
చాలా మంది బ్లాక్ కాఫీని ఇష్టపడతారు. ఇది బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. జీవక్రియ రేటు పెంచడంలో బ్లాక్ కాఫీ చక్కగా వర్క్ చేస్తుంది. కాఫీలోని కెఫిన్ ఎనర్జీ లెవన్స్ ని పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ కొవ్వును ఈజీగా కరిగిస్తుంది.
దాల్చిన చెక్క కాఫీ:
దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కెఫిన్ తో కలిపిన యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియ రేటును పెంచుతాయి. అలాగే బరువును తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. కప్పు బ్లాక్ కాఫీలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తీసుకుంటే ఈ ట్రిక్ బాగా వర్క్ అవుట్ అవుతుంది.
డార్క్ చాక్లెట్ కాఫీ:
డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పదార్థాలను కాఫీతో కలిపి తీసుకోవడం ద్వారా జీవక్రియ రేటును పెంచుతుంది. ఇలా తాగడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి