స్నానం చేసినపుడు మాత్రమే కాకుండా.. మిగతా సమయాల్లోనూ ముఖాన్ని సోప్ లేదా ఫేస్ వాష్ తో కడుక్కోవడం రోజువారీ దిన చర్యలో ఒక భాగం. కొందరు కేవలం బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ఫేస్ వాష్ లను వాడుతారు. మరికొందరు ఇంట్లో కూడా ఫేస్ వాష్ లను యూజ్ చేస్తారు. కొందరు చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక పద్ధతుల్ని కూడా అనుసరిస్తారు. అయితే కొందరికి ముఖం సరిగ్గా కడుక్కున్నా చర్మం గరుకుగా, పొడి బారడం వంటి ఇబ్బందులుంటాయి. ముఖంపై పేరుకున్న జిడ్డు పూర్తిగా పోకపోతే మొటిమలు కూడా వస్తుంటాయి. మరి ముఖాన్ని ఎలా కడుక్కోవాలి? ముఖం కడిగే సమయంలో చేయకూడని మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు సూట్ అయ్యే ఫేస్ వాష్ ని వాడండి:
ఏ ఫేస్ వాష్ క్రీమ్స్ పడితే వాటిని వాడుకోకూడదు. ఫేస్ వాష్ ఎక్కువగా వాడటం వల్ల చర్మం పొడి బారడం, మొటిమలు రావడం వంటి చర్మ సమస్యలు వస్తుంటాయి. మీ స్కిన్ రకాన్ని బట్టి.. దానికి సూట్ అయ్యే సరైన ఫేస్ వాష్ ను ఉపయోగించాలి. లేకపోతే సరైన స్కిన్ స్పెషలిస్ట్ లను కలవాలి.
ఈ టైంలో ఫేస్ వాష్ క్రీమ్ అస్సలు వాడకూడదు:
వేసవిలోనే కాదు సాధారణంగా కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ట్యాంక్ లో ఉండే నీరు చాలా వేడిగా ఉంటుంది. ఇలాంటి నీటితో ముఖం కడుక్కునేటపుడు ఫేస్ వాష్ ను వాడకూడదు. ఈ రెండింటి కలయిక వల్ల నేచురల్ ఆయిల్ తగ్గి.. చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఎలర్జీస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫేస్ వాష్ నే వాడాలనుకుంటే చల్లటి నీటినే వాడాల్సి ఉంటుంది.
వైప్స్ ని వాడకూడదు:
చాలా మంది అధిక వేడి వాతావరణం ఉన్నపుడు ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు వైట్ వైప్ లను వాడుతుంటారు. కానీ వీటితో చర్మం పూర్తిగా శుభ్రం అవ్వదు. పైగా వైప్స్ పూర్తిగా రసాయనాలతో తయారయ్యేవే ఉంటాయి. వీటి వాడకం వల్ల చర్మంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోయి.. స్కిన్ బ్రేక్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి వైప్స్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది.
శుభ్రంగా ఉన్న క్లాత్ తోనే తుడుచుకోవాలి:
చర్మ సంరక్షణ కోసం ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. క్లీన్ గా ఉన్న క్లాత్ తో తుడవడం అంతే ముఖ్యం. మురికిగా ఉన్న క్లాత్ తో తుడిస్తే.. అది మరో చర్మ సమస్యకు కారణం అయ్యే అవకాశాలున్నాయి. దానిపై ఉండే బ్యాక్టీరియా చర్మానికి బదిలీ అయి.. చర్మసంబంధిత సమస్యలు రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి