
ప్యాంక్రియాస్.. దీనినే మనం క్లోమ గ్రంధిగా పిలుస్తుంటాం. శరీరంలోని జీవక్రియల్లో ప్యాంక్రియాస్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్‌నుంచి శక్తిని తీసుకుని వినియోగించుకునేలా, అలాగే అవసరం లేనప్పుడు అదే మళ్లీ అదే గ్లూకోజ్‌ను రక్తం నుంచి తొలగించి, కాలేయంలో భద్రపరచుకునేలా క్లోమగ్రంథి నుంచి హార్మోన్స్ విడుదలవుతాయి.
అంతేకాకుండా శక్తి అవసరమైనప్పుడు గ్లూకగాన్, అవసరం లేనప్పుడు మళ్లీ నిల్వ చేసుకునేందుకు ఇన్సులిన్ అనే హార్మోన్లను ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ లోపం వల్లనే డయాబెటిస్ వస్తుంది. శరీరంలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న క్లోమగ్రంథికి ఏదైనా డ్యామేజ్ జరిగితే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ క్లోమగ్రంథిలో కలిగే ఇబ్బందులు ఏంటి.? మూత్రంలో కనిపించే ఎలాంటి మార్పుల ద్వారా దీనిని గుర్తించవచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం..
* మూత్రం రంగులో ఆకస్మికంగా మార్పు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరంలో ఏదో జరుగుతోందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే ప్యాంక్రియాస్ దెబ్బతినడానికి సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. మూత్రం ముదురు రంగులో వస్తుందంటే.. మీ మూత్రపిండాలు మీ రక్తం నుంచి అదనపు వ్యర్థాలను ఫిల్టర్ చేస్తున్నాయని అర్థం. ప్యాంక్రియాస్ దెబ్బతినడం వల్ల ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్ జీర్ణ వ్యవస్థలో ఆహారాన్ని విచ్చిణ్నం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. అయితే ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు, ఈ ఎంజైమ్‌లు రక్త ప్రవాహాంలోకి విడుదలవుతాయి. దీంతో మూత్రం ముదురు రంగులోకి మారుతుంది.
* ఇక మూత్రంలో నురుగు వస్తున్నా శరీరంలో ఏదో అనారోగ్య సమస్య వస్తుందని గుర్తించాలి. మీ శరీరం నుంచి అదనపు ప్రోటీన్ బయటకు వస్తేనే ఇలాంటి పరిస్థితి వస్తుందని అర్థం. అయితే నురుగు రావడం బ్యాక్టీరియా, మూత్రపిండాల్లో రాళ్లు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు అయినా.. కొన్ని సందర్భాల్లో ప్యాంక్రియాస్ దెబ్బతినడానికి సంకేతం కావొచ్చు.
* మూత్రం ఉన్నట్లుండి అసహ్యకరంగా వాసన వచ్చినా ప్యాంక్రియాస్ దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్యాంక్రియాటిక్ ఆరోగ్య సమస్యను బట్టి మూత్రం వాసన మారుతుండొచ్చని చెబుతున్నారు. అందుకే మూత్రం దుర్వాసన వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు.
* మూత్ర విసర్జన తరచుగా వస్తున్నా, తక్కువ వ్యవధిలోనే ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్లాలన్న కోరిక కలుగుతున్నా ప్యాంక్రియాక్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాలని నిపుణులు చెబుతున్నారు. ప్యాంక్రియాస్ శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించడంలో ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు ఈ హార్మోన్లు ఉత్పత్తి జరగదు దీంతో మూత్ర ఉత్పత్తిలో పెరుగుదల కనిపిస్తుంది.
* మూత్ర విసర్జన చేసే సమయంలో మంట కలుగుతున్నట్లు అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ప్యాంక్రియాస్ మూత్ర నాళాన్ని చికాకు పెట్టే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారణంగానే బర్నింగ్ సెన్సేషన్ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..