
మనం తరచుగా చూసేది ఏంటంటే.. ఎవరైనా ఛాతీ పట్టుకుని భయంతో కింద పడిపోవడం. చాలా మందికి ఇది గుండె సమస్యల లక్షణంగా అనిపిస్తుంది. కానీ అంతకంటే ప్రమాదకరమైనది సైలెంట్ కార్డియాక్ అరెస్ట్. ఇది ముందుగా ఎలాంటి హెచ్చరికలు లేకుండానే వస్తుంది. ఇది సాధారణ హార్ట్ ఎటాక్ కంటే వేరు. హార్ట్ ఎటాక్ అంటే గుండెకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు వచ్చే సమస్య. అలాంటప్పుడు బాధితుడు తాత్కాలికంగా బాధపడినా.. చికిత్స తీసుకునే సమయం ఉంటుంది.
అయితే కార్డియాక్ అరెస్ట్ కి అలాంటి అవకాశం ఉండదు. ఇది గుండె స్పందన సడలిపోవడం వల్ల వస్తుంది. ముఖ్యంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ అనే పరిస్థితి వల్ల గుండె రక్తాన్ని పంపించలేదు. దీని వల్ల మెదడు, శ్వాసనాళాలు, శరీర భాగాలకు ఆక్సిజన్ అందదు. బాధితుడు ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. వెంటనే CPR, డిఫిబ్రిలేటర్ లాంటి ప్రాథమిక చికిత్సలు లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు, ప్రజలు వాటిని సాధారణంగా ఒత్తిడి లేదా సరిగా తినకపోవడం వంటి ఇతర కారణాలకు ముడిపెడతారు. అయితే ఇవి గుండె సంబంధిత ముఖ్యమైన సంకేతాలు అయ్యే అవకాశం ఉంది.
గుండె సమస్యలు ఉన్నవారు, ఎక్కువ బరువు, రక్తపోటు, చక్కెర లాంటి సమస్యలు ఉన్నవారు ప్రమాదంలో ఉన్నా.. ఇతరులకు కూడా ఈ ప్రమాదం రావచ్చు. మీరు ఆరోగ్యంగా ఉన్నా, జిమ్ లో వ్యాయామం చేస్తూ లేదా నిద్రలో ఉన్నప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఇది యువతలో కూడా పెరుగుతోంది కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)