ఎప్పుడైతే ఐటి రంగం ఊపందుకుందో అప్పటి నుంచి ఆడ మగ అనే తేడా లేకుండా ఈ ఐటీ రంగంలో నైట్ డ్యూటీలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే పగలంతా ఖాళీగా ఉండి రాత్రి పని చేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని రంగాల్లో షిఫ్ట్ వైజ్‌లో ఉద్యోగం చేస్తుంటారు. నిజానికి షిఫ్ట్ డ్యూటీ చేయడం వల్ల చాలా సమయం మిగులుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ వారికి అది నష్టం.
రాత్రి సమయంలో డ్యూటీ చేసే వాళ్లు పగలంతా చాలా సమయం దొరుకుతుంది కదా అని ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది వర్క్ ఫ్రం హోం పేరిట నైట్ డ్యూటీ లు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో డ్యూటీలు చేసే వారికి గుండె సమస్యలు అలాగే డయాబెటిస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన ఒక అధ్యయనం లో వెల్లడయింది.
అమెరికాకు చెందిన టారో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కొన్ని నిజాలు కూడా వెల్లడయ్యాయి. ఎప్పుడైతే రాత్రిపూట నిద్ర పోకుండా పనులు చేస్తారో అలాంటి వారికి నిద్రలేమి సమస్యతో పాటు గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. జీవక్రియలు మందగిస్తాయి. బిపి, షుగర్, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడి.. కడుపు సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు ప్రతిరోజు 6 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. తగిన వ్యాయామం చేయడం.. ఆరోగ్యానికి కావలసిన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం వంటివి చేయడం వల్ల వచ్చే సమస్యలను దూరం చేసుకోవచ్చు.
Read Also.. Health Tips: పాలలో ఇవి కలుపుకొని తాగితే.. ఆ సమస్యలన్నీ మటుమాయం.. అవేంటో తెలుసుకోండి