Rice Water Benefits: రైస్ వాటర్ తో నిజంగానే జుట్టు పెరుగుతుందా ? అసలేంటీ దానివెనుక ఉన్న స్టోరీ!

| Edited By: Ravi Kiran

Sep 09, 2023 | 9:00 PM

సమతుల్యత లేని ఆహారం, పెరుగుతున్న కాలుష్యం, విటమిన్లు, పోషకాల లోపం.. ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోయే సమస్య పెరిగిపోతోంది. చుండ్రు, జుట్టు అధికంగా రాలే సమస్యలున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మార్కెట్లలో దొరికే రకరకాల ఆయిల్స్, షాంపూలతో వీటికి శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అందుకే మళ్లీ పాత పద్ధతులను అవలంబించేందుకు ఎక్కువశాతం మంది మొగ్గు చూపుతున్నారు. మన తాతల కాలంలో జుట్టు పెరుగుదలకు పాటించిన పద్ధతుల గురించి తెలుసుకునేందుకు..

Rice Water Benefits: రైస్ వాటర్ తో నిజంగానే జుట్టు పెరుగుతుందా ? అసలేంటీ దానివెనుక ఉన్న స్టోరీ!
Rice Water
Follow us on

సమతుల్యత లేని ఆహారం, పెరుగుతున్న కాలుష్యం, విటమిన్లు, పోషకాల లోపం.. ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోయే సమస్య పెరిగిపోతోంది. చుండ్రు, జుట్టు అధికంగా రాలే సమస్యలున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మార్కెట్లలో దొరికే రకరకాల ఆయిల్స్, షాంపూలతో వీటికి శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అందుకే మళ్లీ పాత పద్ధతులను అవలంబించేందుకు ఎక్కువశాతం మంది మొగ్గు చూపుతున్నారు. మన తాతల కాలంలో జుట్టు పెరుగుదలకు పాటించిన పద్ధతుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిలో భాగంగానే ఇప్పుడు చాలామంది.. జుట్టు పెరుగుదల కోసం రైస్ వాటర్ (బియ్యం కడిగిన నీరు)ను వాడుతున్నారు. ఇది నిజంగానే జుట్టుపెరుగుదలకు సహాయపడుతుందా ? ఈ రైస్ వాటర్ వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం.

చైనీస్ లో హువాంగ్లూ అనే గ్రామం ఉంది. అక్కడ రెడ్ యావో అనే వంశానికి చెందిన మహిళలు తమ జుట్టును కొన్నేళ్లుగా బియ్యం కడిగిన నీటితో కడుక్కునేవారు. వారి జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటంతో ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. దాంతో ఆ గ్రామం పేరు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే పొడవైన వెంట్రుకలు కలిగిన మహిళలు ఉన్న గ్రామంగా నమోదు చేయబడింది. అప్పటి నుంచి జుట్టు సమస్యలకు రైస్ వాటర్ ను వాడటం మొదలుపెట్టారు.

బియ్యం నీటిలో ఇనోసిటాల్, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇవి పొడి, చిట్లిన జుట్టుకు చికిత్స చేసి.. తిరిగి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇనోసిటాల్ జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అలాగే రైస్ వాటర్ లో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు మూలాలను బలంగా, మృదువుగా, మెరిసేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

రైస్ వాటర్ ను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి..

కొద్దిగా బియ్యం తీసుకుని.. వాటిని ఒకసారి కడిగి ఆ నీటిని వంపేయాలి. తర్వాత అందులో కొద్దిగా నీరుపోసి బాగా కడిగి 20 నిమిషాలు నాననివ్వాలి. వేరొక గిన్నెలోకి ఆ నీటిని తీసుకుని.. జుట్టుకు పట్టించాలి. బియ్యం నీటిలో రోజ్మెరి ఆయిల్ కలిపి జుట్టుకు రాస్తే మరిన్ని ప్రయోజనాలుంటాయి. ఇలా జుట్టుకు బియ్యం నీరు పట్టించి.. 30 నిమిషాల తర్వాత మామూలు నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు రైస్ వాటర్ హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. ఖచ్చితంగా జుట్టురాలడం తగ్గి.. ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి