Aches and Pains: మిమ్మల్ని తరచూ ఈ నొప్పులు వేధిస్తున్నాయా? వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే.. లేకపోతే భారీ ముప్పు తప్పదు

ఒక్కోసారి కొన్ని వారాల పాటు నిరంతరం నొప్పులను అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. మీరు దాని నుంచి బయటపడటానికి కొన్ని రకాల ఔషధాలను వాడుతూ ఉంటాయి. అయితే మీకు శరీరంలో ఎక్కడైనా నొప్పి వస్తే దాని మూలాన్ని బట్టి ఆ నొప్పి సాధారణమైనదా? లేదా తీవ్రమైనదా? అని అంచనా వేసుకోవాలని నిపుణుల చెబుతున్నారు.

Aches and Pains: మిమ్మల్ని తరచూ ఈ నొప్పులు వేధిస్తున్నాయా? వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే.. లేకపోతే భారీ ముప్పు తప్పదు

Updated on: Apr 07, 2023 | 5:00 PM

మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు పని ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా డ్యూటీ సమయంలో కంప్యూటర్ వద్ద ఎక్కువ సేపు పని చేయడంతో వివిధ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని వారాల పాటు నిరంతరం నొప్పులను అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. మీరు దాని నుంచి బయటపడటానికి కొన్ని రకాల ఔషధాలను వాడుతూ ఉంటాయి. అయితే మీకు శరీరంలో ఎక్కడైనా నొప్పి వస్తే దాని మూలాన్ని బట్టి ఆ నొప్పి సాధారణమైనదా? లేదా తీవ్రమైనదా? అని అంచనా వేసుకోవాలని నిపుణుల చెబుతున్నారు. అయితే కొంత మంది కొన్ని రకాల నొప్పులను విస్మరించడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాని పేర్కొంటున్నారు. కాబట్టి ముఖ్యంగా నొప్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

చాతి నొప్పి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చాతీ నొప్పి వెన్ను లేదా చేతులకు వ్యాపిస్తుంది. అలాగే గుండెల్లో మంట, న్యుమోనియా లేదా గుండెపోటు వంటి వివిధ వ్యాధుల వల్ల కూడా వస్తుంది. అన్ని నొప్పుల్లో చాతి నొప్పి చాలా ప్రమాదకరమైనది. చాతి నొప్పి వస్తే చాతి నలిగినట్లు లేదా పిండినట్లు అనిపించవచ్చు. నొప్పి కొన్ని నిమిషాలు లేదా ఒక్కోసారి కొన్ని గంటలు కూడా ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఓ ఆరు నెలల పాటు అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటుంది. గుండెపోటు, కరోనరీధమని వ్యాధి, కరోనరీ ఆర్టరీ డిసెక్షన్, పెరికార్డిటిస్, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వంటి కారణాల వల్ల చాతి నొప్పి వేధించే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతగా త్వరగా వైద్యులను సంప్రదించాలి. 

కడుపు నొప్పి

జీర్ణ సమస్యల కారణంగా కడుపు నొప్పి ప్రస్తుత కాలంలో అందరినీ వేధిస్తుంది. వికారం, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాల వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అజీర్ణ సమస్యలు కడుపు నొప్పిలో కీలకపాత్ర పోషిస్తాయి. అపెండిసైటిస్, పిత్తాశయ వ్యాధి, కడుపు లేదా పేగు రుగ్మత లేదా ప్యాంక్రియాటైటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కడుపునొప్పి సంకేతంగా ఉంటుంది. ఒక్కోసారి కడుపు నొప్పి అకస్మాత్తుగా రావచ్చు లేదా క్రమంగా సంభవించవచ్చు. కాబట్టి కడుపు నొప్పి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడకుండా వైద్యం చేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

వెన్నునొప్పి 

వెన్నునొప్పి అనేది చాలా తీవ్రమైన సాధారణమైన నొప్పి రకాల్లో ఒకటి. చాలా మంది ప్రజలు ఓ వయస్సు వచ్చాక అనుభవించే సాధారణ రుగ్మత. వెన్నునొప్పి కోసం నిర్వహణ ప్రణాళికను అభివృద్ధి చేయడం సంక్లిష్టంగా ఉంటుంది. వెన్నునొప్పి మితమైన, తీవ్రమైన లేదా రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరు దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే నొప్పి కూడా కాలులో తిమ్మిరి లేదా బలహీనతకు కారణమవుతుంది. ఒక్కోసారి వెన్నునొప్పి వస్తే మూత్రపిండ వ్యాధులు లేదా మూత్రాశయం వ్యాధులు కూడా కారణం కావచ్చు. 

తలనొప్పి

తలనొప్పి అనేది మనలో చాలా మందికి ప్రతిరోజూ వస్తుంది. అయితే ఈ సమస్య క్లిష్టంగా మారినప్పుడు దానిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వైద్యుల సూచనల ప్రకారం మైగ్రేన్, అధిక రక్త పోటు సెరిబ్రల్ హెరెజ్, ట్యూమర్ వంటి కారణాల వల్ల తలనొప్పి వస్తుందని తేలింది. కాబట్టి తరచూ తలనొప్పి వేధిస్తే వైద్యులను సంప్రదించాలి.

కాళ్లల్లో నొప్పి

శారీరక శ్రమ వల్ల అలసిపోయినట్లు అనిపిస్తే ముఖ్యంగా కాళ్లనొప్పి వేధిస్తుంది. ఈ సమస్య తరచూ వేధిస్తే వైద్యులను సంప్రదించాలి. రక్తం గడ్డకట్టే అవకాశం ఉన్నందున ఒక కాలులో సున్నితత్వం లేదా వాపుతో కూడిన నొప్పి చాలా ఆందోళన కలిగిస్తుంది. సకాలంలో రోగనిర్ధారణ చేయకపోతే లేదా సరైన చికిత్స చేయకపోతే చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాలు నొప్పి సాధారణంగా సయాటికా అని పిచే నడుము నొప్పితో వల్ల కూడా వస్తుందని గమనించాలి. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి