Oldage: ముఖంలో వృద్ధాప్య లక్షణాలు ఎందుకు కనిపిస్తాయో తెలుసా? సుదీర్ఘకాలం యవ్వనంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి!

|

Oct 09, 2021 | 8:55 AM

చాలా మంది ముఖంపై కనిపించే వృద్ధాప్యానికి ఆహారమే కారణమని నమ్ముతారు. కొంత వరకు ఇది నిజం. కానీ, కొత్త పరిశోధనలో, శాస్త్రవేత్తలు దీనికి ఇతర కారణాలను తెలుసుకున్నారు.

Oldage: ముఖంలో వృద్ధాప్య లక్షణాలు ఎందుకు కనిపిస్తాయో తెలుసా? సుదీర్ఘకాలం యవ్వనంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి!
Oldage
Follow us on

Oldage: చాలా మంది ముఖంపై కనిపించే వృద్ధాప్యానికి ఆహారమే కారణమని నమ్ముతారు. కొంత వరకు ఇది నిజం. కానీ, కొత్త పరిశోధనలో, శాస్త్రవేత్తలు దీనికి ఇతర కారణాలను తెలుసుకున్నారు. ఈ అంశాలపై సాధారణంగా ఎవరూ దృష్టి పెట్టరు. వృద్ధాప్య లక్షణాల పై శాస్త్రవేత్తలు చెబుతున్న కారణాలు ఏమిటి, ఎందుకు? ఎలా వుద్దాప్య లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి. సుదీర్ఘకాలం యవ్వనంగా కనిపించడానికి ఏ విషయాలు గుర్తుంచుకోవాలి … ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి

ఈ మూడు అలవాట్లు వయస్సు రాకముందే మిమ్మల్ని వృద్ధులను చేస్తాయి

నిద్రలో తప్పువిధానం: జర్నల్ ఆఫ్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం, పక్కలో పడుకున్నప్పుడు ముఖాన్ని దిండుతో రుద్దడం వల్ల ముడతలు పెరుగుతాయి. ఇలా చేయడం మానుకోండి.

చక్కెర అధికంగా తీసుకోవడం: షుగర్ తర్వాత గ్లైకేషన్ ప్రక్రియలో ప్రమాదకరమైన ఫ్రీ-రాడికల్స్‌గా మార్చబడి, కణాలను దెబ్బతీస్తుందని, స్ప్రింగర్ లింక్ జర్నల్‌లో ఒక అధ్యయనం చెబుతోంది.

స్క్రీన్ సమయం: పబ్‌మెడ్ జియో జర్నల్ ప్రకారం, మీరు వారానికి 4 రోజులు కంప్యూటర్‌లో 8 గంటల షిఫ్ట్‌లలో పని చేస్తే, అది మధ్యాహ్నం ఎండలో 20 నిమిషాలు గడపడానికి సమానం. హానికరం.

వృద్ధాప్య ప్రభావాలను నివారించడానికి ఈ 5 విషయాలు సహాయపడతాయి

సూర్యరశ్మి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. బలమైన సూర్యకాంతిలో బయటకు వెళ్లడం మానుకోండి. ఎందుకంటే, ఇది చర్మానికి హాని కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా, అకాల ముడతలు చర్మంపై కనిపిస్తాయి. ఒకవేళ మీరు తప్పనిసరిగా ఎండలో ఉండాల్సి వస్తే శారీరం పూర్తిగా కప్పుకుని ఉంచుకునే జాగ్రత్త తీసుకోండి. లేదా SPF 30 తో సన్‌స్క్రీన్ లోషన్ రాయండి.

ఆహారంలో మార్పులు..

నూనె, మసాలా దినుసులు వంటి వాటికి దూరంగా ఉండండి . విటమిన్-ఇ, సి మంచి పరిమాణంలో ఉండే ఆహారం తీసుకోండి. యాంటీఆక్సిడెంట్లు వాటిలో మంచి మొత్తంలో కనిపిస్తాయి. కణాలను దెబ్బతీసే మూలకాల ప్రభావాన్ని తతస్థం చేస్తాయి. దీని కోసం, ఆకుకూరలు, కివి, నిమ్మ, డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తులను ఆహారంలో తీసుకోండి.

చర్మంలో తేమ..

సమయానికి ముందు వృద్ధులుగా కనిపించడానికి ఒక కారణం చర్మంలో తేమ లేకపోవడం. అందువల్ల, స్నానం చేసిన వెంటనే చర్మంపై మాయిశ్చరైజర్ రాయండి. అవి చర్మంలోని తేమను ఎక్కువ కాలం ఉంచుతాయి. ఇది కాకుండా, అంతర్గతంగా శరీరంలో నీరు లేకపోవడాన్ని అనుమతించవద్దు. రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగండి. ఇది ముడతల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ముఖం మెరుపును కూడా పెంచుతుంది.

నవ్వుతూ ఉండండి..

సంతోషం, అసంతృప్తి మీ చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. నవ్వడం ద్వారా, ముఖం కండరాలకు చక్కని వ్యాయామం దొరుకుతుంది. వృద్ధాప్య ప్రభావం కూడా తగ్గుతుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిని ఆమోదించారు.

వారానికి 5 రోజులు వ్యాయామం..

పెరుగుతున్న బరువు, నిశ్చల జీవనశైలి కూడా వృద్ధాప్యానికి కారణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారానికి కనీసం 5 రోజులు 1 గంట వ్యాయామం చేయడం అవసరం. దీని ప్రభావం ముఖంతో పాటు శరీరంపై కూడా కనిపిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచడం ద్వారా, చర్మం మెరుపు పెరుగుతుంది. ముడుతలను కూడా చాలా వరకు నియంత్రించవచ్చు.

ఇవి కూడా చదవండి: CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

Huzurabad – Badvel: తెలంగాణ హుజురాబాద్‌.. ఆంధ్ర బద్వేల్‌ బైపోల్‌ వార్‌లో నమోదైన నామినేషన్ల చిట్టా ఇదీ.