ఆరోగ్యంగా ఉండేందుకు అనేక పద్ధతులను అవలంబిస్తుంటాం. హెల్దీ లైఫ్ స్టైల్ కోసం చాలా మంది గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటివి తాగుతుంటారు. కొందరు నేచురల్ గా ఉండే కొన్ని కషాయాలను తాగుతుంటారు. వాటిలో ఒకటి కలబంద రసం. శారీరక , మానసిక సమస్యలకు కలబంద రసం బాగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. కలబంద రసం తాగడమే కాదు.. దాని జెల్ ను జుట్టు, ముఖం, చర్మ సౌందర్యానికి కూడా వాడుతారు. కలబంద రసం తాగడం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది? ఎవరెవరు ఈ రసాన్ని తాగకూడదో తెలుసుకుందాం.
పోషకాలు మెండుగా ఉంటాయి:
కలబందరసం పరగడుపునే తాగితే చాలా మంచిదని పెద్దలు, ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్లు ఎ,సి,ఈ, బి-కాంప్లెక్స్ తో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఖాళీ కడుపుతో కలబందరసం తాగితే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి.
జీర్ణ వ్యవస్థకు మంచిది:
పరగడుపునే కలబందరసం తాగడం.. జీర్ణ వ్యవస్థకు చాలా మంది. ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. కలబంద మొక్క రక్తంలో చక్కెర, కొవ్వును నియంత్రించే అవసరమైన ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణాశయాంతర సమస్యలను నివారిస్తుంది.
కడుపులోని వ్యర్థాలను బయటకు పంపుతుంది:
శరీరాన్ని డిటాక్స్ గా ఉంచుతుంది. సహజంగా పొట్ట శుభ్రమవుతుంది. కడుపులోని వ్యర్థాలను బయటకు పంపి.. కాలేయాన్ని కూడా శుభ్రంగా ఉంచుతుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
కలబంద రసం సైడ్ ఎఫెక్ట్:
పొటాషియం లోపం: పరగడుపున కలబంద రసం తాగితే అంతా మంచే జరుగుతుందా అంటే కాదు. కలబంద రసాన్ని అతిగా తాగితే.. శరీరంలో పొటాషియం లోపం ఏర్పడి.. గుండె వేగంగా కొట్టుకుంటుంది లేదా ఆగిపోతుంది. ముఖ్యంగా చలికాలంలో కలబంద రసాన్ని ఎక్కువగా తీసుకోకూడదు.
గర్భిణీ స్త్రీలు తాగకూడదు: గర్భిణీ స్త్రీలు, బాలింతలు కలబంద రసం తాగకూడదు. గర్భవతులు ఈ రసం తాగితే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి