Teeth: భోజనం చేసిన వెంటనే బ్రష్‌ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

|

Jul 24, 2023 | 6:30 AM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నోరు ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా దంతాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. అయితే చాలా మంది దంతాల ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. ముఖ్యంగా బ్రషింగ్‌ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. అందుకే ఉదయం, రాత్రిపూట రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలని సూచిస్తుంటారు...

Teeth: భోజనం చేసిన వెంటనే బ్రష్‌ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
Teeth
Follow us on

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నోరు ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా దంతాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. అయితే చాలా మంది దంతాల ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. ముఖ్యంగా బ్రషింగ్‌ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. అందుకే ఉదయం, రాత్రిపూట రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలని సూచిస్తుంటారు. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే చపాతీలు, అన్నం వంటివి తీసుకున్న తర్వాత నోట్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది దంతాలకు రక్షణగా నిలిచే తెల్లటి పొరను దెబ్బతీస్తుంది.

అందుకే తిన్న తర్వాత బ్రష్‌ చేసుకుంటే బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత పళ్లు తోముకోమనేది అందుకే. అయితే తిన్న వెంటనే బ్రష్‌ చేసినా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పుల్లటి పదార్థాలు తీసుకున్న తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగాలని చెబుతున్నారు. దీనికి కారణం పుల్లటి పదార్థాల్లోని ఆమ్లం ఎనామిల్‌ పొరను బలహీన పరుస్తుంది.

అందుకే పుల్లటి ఆహార పదార్థాలు తిన్న వెంటనే బ్రష్‌ చేస్తే.. దంతాలపై ఉండే ఎనామిల్‌ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఎనామిల్‌ దంతాలపై నుంచి తొలగిపోతే.. తిరిగి పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి పుల్లటి పదార్థాలు తినడానికి ముందే పళ్లు తొముకోవాలని నిపుణులు చెబుతున్నారు. తిన్న తర్వాత నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉంచితే సరిపోతుందని చెబుతున్నారు. ఇలే చేస్తే పళ్లపై ఉండే ఆమ్లం ప్రభావాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..