Custard Apple Side Effects: రుచిగా ఉన్నాయని సీతాఫలాలు తెగ లాగించేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవంటోన్న నిపుణులు

|

Oct 21, 2022 | 1:24 PM

అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు ఏదైనా అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది. సీతాఫలం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సీతాఫలం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.

Custard Apple Side Effects: రుచిగా ఉన్నాయని సీతాఫలాలు తెగ లాగించేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవంటోన్న నిపుణులు
Custard Apple
Follow us on

శీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తుంటాయి. రోడ్డు పక్కన, దుకాణాల్లో ఎక్కడ చూసినా ఈ పండ్లే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. తినడానికి అమృతం లాగే అని పించే ఈ పండులో కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్యం విషయంలోనూ సీతాఫలాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. కేవలం సీతాఫలమే కాకుండా ఆ చెట్టు బెరడు, ఆకులు సైతం ఎన్నో ఆయుర్వేద మందుల్లో ఉపయోగపడతాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు ఏదైనా అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది. సీతాఫలం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సీతాఫలం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అలాగే రక్తపోటు, డయాబెటిస్‌ సమస్యలున్న వారు ఈ పండును మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి సీతాఫలంతో కలిగే దుష్ప్రభవాలేంటో తెలుసుకుందాం రండి.

సీతాఫలం సైడ్‌ ఎఫెక్ట్స్‌..

  • చాలా మందికి సీతాఫలం పడదు.దీనిని తినడం వల్ల ఒక్కోసారి దురద, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు.ఇలాంటి సమస్యలున్నవారు సీతాఫలం పండును తీసుకోకపోవడమే మంచిది.
  • అలాగే ఏదైనా జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు, గ్యాస్ సమస్యలు వస్తాయి.
  • సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి సీతాఫలాన్ని ఎక్కువగా తినకూడదు. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • రక్తపోటు సమస్యలు ఉన్నవారు సీతాఫలాలను మితంగా తీసుకోవాలి. దూరం పెడితే మరీ మంచిది. ఇందులోని గుణాలు అకస్మాత్తుగా రక్తపోటును తగ్గిస్తాయి. తద్వారా మైకం, మూర్ఛ, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • సీతాఫలంలో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగవచ్చు. అలాగే ఈ పండులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది కూడా బరువును పెంచుతుంది.
  • సీతాఫలం గింజలు విషపూరితమైనవి. ఇవి చర్మంపై, ముఖ్యంగా కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అదేవిధంగా సీతాఫలం పొడిని ఉపయోగించడం వల్ల కొందరికీ దద్దుర్లు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

సీతాఫలాన్ని ఎలా తినాలి..?

సీతాఫలం ఎల్లప్పుడూ పై భాగాన్ని తీసివేసి, గింజలను తీసివేసిన తర్వాత మాత్రమే తినాలి. తినే సందర్భంలో తొక్క, విత్తనాలను పూర్తిగా నివారించాలి. అవి ఆరోగ్యానికి హానికరం. మంచిగా శుభ్రం చేసిన తర్వాత, తొక్క, విత్తనాలను వేరుచేసి తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో ఏ నిర్ణయమైనా సరే వైద్యుల సలహాలు తీసుకున్న తర్వాతే పాటించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి..