Health: మీరు స్నానం చేసే విధానం మీ జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని తెలుసా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మనిషి జీవించాలంటే సరైన ఆహారం తీసుకోవాలనే విషయం మనందరికీ తెలిసిందే. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తి అందడంలో జీర్ణక్రియ వ్యవస్థ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే ఈ జీర్ణక్రియపై ఎన్నో రకాల అంశాలు..

Health: మీరు స్నానం చేసే విధానం మీ జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని తెలుసా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Bathing And Digestion

Updated on: Oct 19, 2022 | 6:20 AM

మనిషి జీవించాలంటే సరైన ఆహారం తీసుకోవాలనే విషయం మనందరికీ తెలిసిందే. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తి అందడంలో జీర్ణక్రియ వ్యవస్థ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే ఈ జీర్ణక్రియపై ఎన్నో రకాల అంశాలు ప్రభావం చూపుతాయి. వీటిలో స్నానం కూడా ఒకటి. భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదని మన పెద్దలు తరచూ చెబుతుండడం వినే ఉంటాయి. ఇంతకీ జీర్ణక్రియపై స్నానం ఎలాంటి ప్రభావం చూపుతుంది. స్నానం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి వివరాలను ప్రముఖ ఆయుర్వేద డాక్టర్‌ డింపుల్ జంగ్దా వివరించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

* ఫుల్‌ మీల్స్‌ తీసుకున్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు. స్నానం చేసే సమయంలో జీర్ణక్రియ వేగం తగ్గుతుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. సాధారణంగా జీర్ణక్రియ ప్రక్రియకు ఉపయోగపడడానికి శరీరం జీర్ణవ్యవస్థకు అవసరమైన రక్తాన్ని పంపుతుంది. కానీ భోఒజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల కడుపు భాగం నుంచి రక్త ప్రవాహం చెదిరిపోతుంది. దీంతో భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల మీ శరీరాన్ని గందరగోళానికి గురి చేస్తుంది. దీనివల్ల కడుపులో తిమ్మిరి, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. భోజనం చేసిన తర్వాత కనీసం 30 నుంచి 45 నిమిషాల తర్వాతే సన్నానం చేయడం మంచిదని డాక్టర్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి

* స్నానం చేయడానికి ముందు కచ్చితంగా ఒక గ్లాస్‌ నీటిని తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. మరీముఖ్యంగా గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది ఆహారం జీర్ణకావడంలో ఉపయోగపడుతుంది.

* సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయకూడదు. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత మన శీరరంలో వేడి తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి దీంతో శరీరంలోని వేడి బయటకు వెళ్లదు. శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రత నిద్రకు భంగం కలిగిస్తుంది.

* స్నానం చేసే సమయంలో రక్త ప్రసరణ మెరుగుపరచ్చడానికి గోరు వెచ్చని నీటికే ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల సున్నితమైన అవయవాలను రక్షించుకోవచ్చు. అలాగే ముఖానికి రూమ్‌ టెంపరేచర్‌ ఉండే నీటిని ఉపయోగించాలి. చిన్నారులు, పెద్దలు అలాగే అనారోగ్యంతో ఉండే వారు మాత్రమే స్నానానికి వేడి నీటిని ఉపయోగించాలి.

* స్నానం చేసే ముందు ఆయిల్ మసాజ్‌ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే చన్నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుంచి లాక్టిక్‌ యాసిడ్‌ బయటకు వెళ్తుంది. దీనివల్ల రక్త నాళాలు బిగుతుగా మారేలా చేస్తుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..