మొలకెత్తిన విత్తనాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉండటం వలన శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు తినే పోషకాహారం. ప్రస్తుత పరిస్థితులలో కరోనాను జయించడానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం. ఇందుకోసం ఆరోగ్యానికి మేలు చేసే సహజ వనరులను, పదార్థాలను తీసుకోవడం మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ మొలకెత్తిన గింజలను తీసుకోవడం మంచిది. అయితే వీటిని అలాగే తినలేని వారు.. కాస్తా భిన్నంగా సూప్ చేసుకొని కూడా తినవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సినవి..
మొలకెత్తిన విత్తనాలు.. ఒక కప్పు..
వెల్లుల్లి.. 2 రెబ్బలు
ఉల్లిపాయలు.. ఒకటి.
జీలకర్ర.. 1 టేబుల్ స్పూన్
బ్లోజాబ్.. 1 టేబుల్ స్పూన్
మిరియాలు… 1/2 టేబుల్ స్పూన్
కొబ్బరి పాలు.. 1 కప్పు
పెరుగు.. 1/2 కప్పు
కొత్తిమీర
ఉప్పు.. తగినంత
తయారీ విధానం..
ముందుగా మొలకెత్తిన విత్తనాలను ఒక పాత్రలో వేసి ఉడికించుకోవాలి.. ఆ తర్వాత కొబ్బరి కాయను రుబ్బి పాలను వేరు చేయాలి. మరో పాత్రలో వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, ఉడికించిన విత్తనాలు కలిపి రుబ్బుకోవాలి. మరో పాత్రలో నూనె వేసి.. అందులో ఈ విత్తనాల పేస్ట్ వేసి గోల్డ్ రంగులోకి వచ్చేవరకు వేడి చేయ్యాలి. దీనిలో ఉడికించిన విత్తనాల నీటిని కలిపి కాసేపు మరిగించాలి. అందులోనే కొబ్బరి పాలు పోసి మరింత మరగనివ్వాలి. ఇక స్టవ్ ఆప్ చేసి దింపుకునే ముందు కొత్తిమీర వేయాలి. దీనిని వడ్డించేటప్పుడు పాలు, నిమరసం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే రుచి బాగుంటుంది.