Diabetes: మధుమేహం.. ఇది దేశంలో చాలా మందిని వెంటాడుతోంది. ప్రతి ఇంట్లో మధుమేహం బారిన పడేవారున్నారంటే ఏ మేరకు విస్తరిస్తుందో అర్థమైపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ డయాబెటిస్ వెంటాడుతోంది. దీనిని పూర్తిగా తగ్గించుకునే మార్గాలు లేవు. కేవలం అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటిస్తూ అదుపులో పెట్టుకోవాల్సిందే. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. రానున్న దశాబ్దాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మందికిపైగా మధుమేహం బారిన పడే అవకాశం ఉందని ఒక అంచనా. అయితే మన ఇంట్లోనే దొరికి కొన్ని ఆహారాలతో మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.
జన్యుపరమైన కారణాలవల్ల మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. అలాగే, పొగాకు వాడకం, అతిగా మద్యం సేవించడం వంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఊబకాయం, నియంత్రణ లేని జీవన విధానం రిస్క్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు వ్యాయామం చేయడం, బరువును చెక్‌చేసుకోవడం వల్ల నియంత్రణలో ఉంచుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో పోషకాలతో కూడిన ఫుడ్మెనూను నిత్యం ఫాలో కావాలి. తృణధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ధూమపానం వెంటనే మానుకోవాలి. మెడిటేషన్, యోగా క్రమంగా చేయడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
వీటిని దూరంగా ఉండండి:
పిల్లల్లోనే కాకుండా పెద్దల్లో కూడా శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ మొత్తంలో క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్ వెంటాడుతోంది. అందుకే చక్కెర స్థాయిలున్న ఆహారాలు, పానీయాలను దూరం ఉండటం మంచిది. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటివి తీసుకోవాలి.
చేపలు:
చేపల్లో ఒమెగా-3 పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన నూనెలు, పప్పులు తింటూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు నిత్యం రెండున్నర గంటల పాటు వేగంగా నడవటం ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
సమయానికి భోజనం చేయడం:
డయాబెటిస్ ఉన్న వారు ప్రతి రోజు సమయానుకూలంగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.గోర్లు కట్ చేసేప్పుడు గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించడం మంచిది. పీచు పదార్థాలు ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి: