Health Tips: జిమ్ వెళ్లే టైమ్ లేదా? అయితే ఈ 4 వ్యాయామాలు చేస్తే అంతా సెట్!!

|

Nov 16, 2024 | 6:30 PM

రోజు వ్యాయామం చేస్తే శరీరం బలంగా తయారవుతుంది. వ్యాయామం చేస్తే తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నుంచి కూడా తగ్గిస్తుంది. అయితే చాలా మందికి జిమ్‌కి వెళ్లడానికి, వివిధ రకాల వ్యాయామాలు చేయడానికి సమయం ఉండదు. అలాంటి వారు ఈ నాలుగు వ్యాయామాలు చేస్తే బాడీ ఆరోగ్యంగా ఉంటుంది.

Health Tips: జిమ్ వెళ్లే టైమ్ లేదా? అయితే ఈ 4 వ్యాయామాలు చేస్తే అంతా  సెట్!!
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలని మనందరీకి తెలిసిందే. వ్యాయామం అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దానికి తోడు ఇది మన శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ఈ రోజుల్లో చెడు ఆహారపు అలవాట్లు, చెడిపోయిన జీవనశైలి కారణంగా చాలా మంది స్థూలకాయానికి గురవుతున్నారు.  ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరు తమ దినచర్యలో వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం కండరాలను బలపరుస్తుంది. అలాగే ఎనర్జీ లెవల్స్‌ కూడా పెరుగుతాయి. బిజీ షెడ్యూల్స్ కారణంగా కొంతమందికి జిమ్‌కి వెళ్లడానికి, వివిధ రకాల వ్యాయామాలు చేయడానికి సమయం ఉండదు. అటువంటి పరిస్థితిలో కొన్ని వ్యాయామాల చేస్తే ఫుల్ బాడీ వర్క్ అవుట్ అవుతుంది.  కాబట్టి అలాంటి వారు ఆ వ్యాయామాలు చేస్తే చాలు..

పుషప్స్

పుషప్స్ చాలా పాతవి కానీ ప్రభావవంతమైన వ్యాయామం అని చెప్పవచ్చు. ప్రారంభంలో ఇవి చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. దీన్ని చేయడానికి మీ అరచేతులను నేలపై ఉంచండి. మీ శరీర బరువును మీ కాలి, అరచేతులపై ఉంచండి. ఇప్పుడు చేతులను వంచి, శరీరం పై భాగాన్ని భూమి వైపుకు తరలించి, ఆపై దానిని పైకి ఎత్తండి. దీంతో శరీరం మొత్తంలో కదలిక జరుగుతుంది.

బర్పీ  

బర్పీ అనేది అధిక తీవ్రత కలిగిన వ్యాయామం. ఇది శరీరం పై భాగాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాయామం కోసం మూడు పుషప్స్, జంప్‌లు మరియు స్క్వాట్‌లు కలిపి చేయాలి. దీంతో కండరాలు బలపడతాయి.

ప్లాంక్ 

కోర్ కండరాలను బలోపేతం చేయడానికి ప్లాంక్ వ్యాయామం పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల వీపు, పొట్ట, భుజాలకు బలం చేకూరుతుంది. ఇందులో మీరు మీ శరీరాన్ని నిటారుగా ఉంచుకోండి. 30 సెకన్ల నుండి 1 నిమిషం వరకు ఈ స్థితిలో ఉండండి. క్రమంగా సమయాన్ని పెంచండి. 2-3 సార్లు పునరావృతం చేయండి.

రన్నింగ్ మరియు సైక్లింగ్

రన్నింగ్ మరియు సైక్లింగ్ కండరాలకు బలాన్ని అందిస్తాయి. దీనివల్ల హృదయ స్పందన రేటు కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల కేలరీలు కూడా వేగంగా ఖర్చవుతాయి. రోజూ రన్నింగ్ మరియు సైక్లింగ్ చేయడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి