Dog Bite: ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న ఒక సంఘటన హృదయాన్ని బద్దలు చేస్తోంది. అక్కడ ఒక చిన్న పాపను వీధి కుక్కలు కొరికి చంపేశాయి. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పిల్లలను వీధి కుక్కల బారిన పడకుండా ఎలా చూడాలి అనేది పెద్దలకు పెద్ద సమస్యగా మారిపోయింది. పిల్లలు ఆడుకోవడం లేదా.. దగ్గరలోని పార్కులకు వెళ్ళడం వంటి పనులు తల్లిదండ్రులను టెన్షన్ లోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్రమత్తతగా ఉండడం.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం తప్ప మరోమార్గం కనిపించడంలేదు. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత అప్రమత్తంగా ఉన్నాసరే, వీధి కుక్కలు వెంటపడటం.. కరవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా కుక్క కాటుకు గురైతే ఏమి చేయాలనేదానిపై నిపుణులు సలహాలు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం.
కుక్క కాటు ఎంత ప్రమాదకరం?
ఇప్పటికీ కుక్కకాటుకు నాలుగైదు ఇంజక్షన్లు వేస్తున్నారు. ముఖ్యంగా కుక్క కాటు చర్మం లోపల పళ్లలోకి చొచ్చుకుపోయి రక్తం బయటకు వచ్చినప్పుడు శరీరంలో రాబిస్ బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. ఈ కాటును రెండు గ్రేడ్‌లుగా విభజించారని నిపుణులు చెప్పారు. గ్రేడ్ 1: ఇది చిన్న గాయాలకు వర్తిస్తుంది. గ్రేడ్ 2: ఇది తీవ్రమైన గాయాలను సూచిస్తుంది. తీవ్రమైన గాయం విషయంలో రాబిస్ ఇమ్యునోగ్లోబిన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ గాయం చుట్టూ చేస్తారు. తద్వారా బ్యాక్టీరియా నియంత్రణ లోకి వస్తుంది. కుక్కకాటు చాలా ప్రమాదకరం ఎందుకంటే భవిష్యత్తులో దాని వల్ల రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
కుక్క కరిచినప్పుడు పొరపాటున కూడా ఇటువంటి మూర్ఖపు పని చేయకండి..
మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు కొంతమంది నాటు వైద్యుడి వద్దకు వెళ్లి గాయానికి కుట్లు వేస్తారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అదే సమయంలో కారం పొడిని లేదా తేనె, ఉల్లిపాయ రసాన్ని రాసుకుంటే గాయం మానుతుందనే అపోహ కొందరిలో ఉంది. ఇలాంటి మూర్ఖత్వానికి లోనుకాకుండా డాక్టర్ వద్దకు వెళ్లి ఆయన సలహా మేరకు మాత్రమే మందులు వాడడం మంచిది. కుక్క కాటుకు సంబంధించి యాంటీ-రేబిస్ టీకాను పొందినట్లయితే, మీరు ఉపశమనంతో ఊపిరి పీల్చుకోవచ్చు. ఎటువంటి పరిస్థితిలోనూ కుక్క కాటును నిర్లక్ష్యం చేయవద్దు.. ఇంటి వైద్యానికి ప్రయత్నించవద్దు.. అని నిపుణులు కచ్చితంగా చెబుతున్నారు.
రాబిస్ లక్షణాలివే..
ఇవి కూడా చదవండి: Smart Phones: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త సంవత్సరంలో సంచలనం సృష్టించనున్న ఫోన్‌లు ఇవే!
Adar Poonawalla: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం వైపు సీరమ్ అధినేత చూపు.. ‘వాకౌ’లో 20 శాతం వాటా కొనుగోలు!
Amla Benefits: ఉసిరిని ఇలా తీసుకుంటే అద్భుతమైన రుచి.. అంతకు మించిన ఆరోగ్యం