Health Tips: మీకు ఈ సమస్యలు ఉంటే టమాటాలు అస్సలు తినకూడదు.. నిర్లక్ష్యం చేస్తే విషంతో సమానం..!

|

Dec 23, 2022 | 6:34 PM

టమాటాలను తినడం ద్వారా మనం అనేక రకాల పోషకాలను పొందవచ్చు. ఇంకా టమోటాలు అనేక వ్యాధులకు మందుగానూ పనిచేస్తుంది. కానీ, టమాటాలను కొద్ది మంది మాత్రం తిననే కూడదు.

Health Tips: మీకు ఈ సమస్యలు ఉంటే టమాటాలు అస్సలు తినకూడదు.. నిర్లక్ష్యం చేస్తే విషంతో సమానం..!
టోమాటో.. సాధారణంగా వంటగదిలో టోమాటో లేకుండా ఉండదు. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అలాగే అధిక మోతాదులో పోటాషియం, విటమిన్ సీ తో పాటు లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది స్కిన్ కేన్సర్ నుంచి రక్షణ ఇస్తుంది. ప్రతి 100 గ్రాములకు 19 కిలకేలరీలను శరీరానికి అందిస్తుంది. ఇది శరీర బరువును అదుపులో ఉండేందుకు సాయపడుతుంది.
Follow us on

మనం నిత్యం వండే కూరగాయలలో టమాటా ఒకటి. టమాటాలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి, స్టార్చ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, ఇందులో పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, ఫోలేట్, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి టమాటాలను తినడం ద్వారా మనం అనేక రకాల పోషకాలను పొందవచ్చు. ఇంకా టమోటాలు అనేక వ్యాధులకు మందుగానూ పనిచేస్తుంది. కానీ, టమాటాలను కొద్ది మంది మాత్రం తిననే కూడదు. టమోటాలు ఎవరు తినకూడదో తెలుసుకుందాం..

టమాటాలు ఎవరు తినకూడదు?
కిడ్నీ పాడైపోయినవారు, కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ ముందు దశ, డయాలసిస్ రోగులు, కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు టమోటాలు తీసుకోకూడదు. టమాటాలు రోజు ఆహారంలో బాగం చేసుకుంటున్నా కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డ‌ని వారు నిరభ్యంత‌రంగా టమాటాలను తినవచ్చు. కానీ కిడ్నీ స్టోన్లు ఒక‌సారి ఏర్ప‌డి తొల‌గిపోయినా, ప‌దే ప‌దే స్టోన్లు వ‌స్తున్నా టమాటాను తినకుండా ఉండటమే మేలు.

ప్రమాదానికి కారణమేమిటి?
మూత్రపిండాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు టమోటాలు తినకూడదు. ఎందుకంటే, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పొటాషియం బయటకు వెళ్లకుండా శరీరంలోనే ఉండిపోతుంది. రక్తంలో ఉండిపోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్‌ని సృష్టించి గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందువల్ల, పొటాషియం పుష్కలంగా ఉండే టమోటాలను పూర్తిగా నివారించడం వారికి అవసరం. కొంతమంది మాత్రమే తమ శారీరక స్థితిని బట్టి కొంత మొత్తంలో ఉపయోగించగలరు.

ఇవి కూడా చదవండి

టమాటా ఎవరికి మంచిది?
చర్మపు పుండ్లు, తరచుగా చర్మం రంగు మారడం, నిరంతర పుండ్లు వంటి వాటితో బాధపడేవారు టమోటాలను ఎక్కువగా తీసుకోవచ్చు. విటమిన్ ఎ లోపం, కంటి సమస్యలు ఉన్నవారు తరచుగా టమోటాలు తినవచ్చు. టమోటాలు గుండె రోగులకు, బైపాస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. టొమాటోలు అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

టమాటాతో ప్రయోజనాలు:
టమోటాలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. దంతాలు, చిగుళ్ళు, చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. టమోటాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవయవాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టమోటాలు గుండె జబ్బులకు చాలా మేలు చేస్తాయి. రక్త నాళాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది.

మీరు ఎన్ని టమాటాలు తినవచ్చు?
సగటు వ్యక్తి రోజూ 300 నుంచి 400 గ్రాముల కూరగాయలు తినాలి. టమాటోలను 100 గ్రాముల వరకు చేర్చుకోవచ్చు. ఇది రెండు టమోటాలకు సమానం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి