AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె ఆరోగ్యానికి గుడ్లు మంచివేనా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

గుడ్లు తినడం గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉంటారు. ASPREE అనే సంస్థ చేసిన తాజా పరిశోధన ప్రకారం వారానికి 1 నుండి 6 సార్లు గుడ్లు తినే వృద్ధుల్లో గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశాలు తగ్గుతాయని తేలింది. దీంతో గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న ఉద్దేశం బలపడింది.

గుండె ఆరోగ్యానికి గుడ్లు మంచివేనా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Eggs
Prashanthi V
|

Updated on: Mar 15, 2025 | 8:14 AM

Share

గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయా..? ASPREE అనే సంస్థ చేసిన అధ్యయనంలో వృద్ధులలో గుండె ఆరోగ్యం, గుడ్ల వినియోగం మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల 8756 మందికి సంబంధించిన డేటాను ఈ అధ్యయనం పరిగణలోకి తీసుకుంది.

గుడ్లు తినడం గుండె ఆరోగ్యానికి మంచిదా..? అనే ప్రశ్న చాలాకాలంగా వివాదాస్పదంగా ఉంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా గుడ్లు తినడం వృద్ధుల్లో గుండె జబ్బుల కారణంగా మరణించే అవకాశాన్ని తగ్గించవచ్చని వెల్లడించారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన వృద్ధులలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.

ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు వారానికి ఎన్ని సార్లు గుడ్లు తింటారు అనే విషయాన్ని గమనించారు. వారానికి 1 నుండి 6 సార్లు గుడ్లు తినే వృద్ధులు, ఎప్పుడూ గుడ్లు తినని వారితో పోలిస్తే ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం 15 శాతం తక్కువగా ఉంది. అలాగే గుండె జబ్బులతో మరణించే అవకాశం 29 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు నిర్ధారించారు.

గుడ్లలోని పోషకాలు

గుడ్లు పోషకాలలో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్, బి-విటమిన్లు, ఫోలేట్, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు గుడ్లలో ఉంటాయి. ఈ పోషకాలు వృద్ధుల శారీరక బలాన్ని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ఆహారం, గుడ్లు

వృద్ధులలో ఆహారపు అలవాట్ల ఆధారంగా గుడ్ల వినియోగాన్ని పరిశీలించారు. మితంగా అధిక నాణ్యత గల ఆహారం తీసుకునే వృద్ధులకు గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం తేల్చింది. దీని అర్థం గుడ్లు మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, గుండె జబ్బులకు వ్యతిరేకంగా రక్షణగా ఉండవచ్చని సూచిస్తున్నారు.

గుడ్లు, కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు వారానికి గుడ్లు తినడం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే పరిశోధనలో కనీసం వారానికి ఒకసారి గుడ్లు తినే వారికి గుండె జబ్బుల కారణంగా మరణించే అవకాశం 27 శాతం తక్కువగా ఉందని వెల్లడించింది. గుడ్లను సమతుల్యమైన ఆహారంలో భాగంగా తీసుకోవడం వృద్ధులకు మేలు చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది.