ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినండి..! కాల్షియం అధికంగా ఉండే పండ్లు ఇవిగో..!
శరీరంలో ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు కాల్షియం అత్యంత ముఖ్యమైన ఖనిజం. చాలా మంది కాల్షియం కోసం పాలపై ఆధారపడుతుంటారు. కానీ పండ్ల ద్వారా కూడా మంచి కాల్షియం మోతాదు పొందవచ్చు. అంజీర్, కివి, బొప్పాయి, నేరేడు వంటి పండ్లు కాల్షియం అధికంగా కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసే సహజమైన ఆహారాలు.

పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కానీ కేవలం పాల ద్వారా మాత్రమే కాకుండా పండ్లలో కూడా మంచి మొత్తంలో కాల్షియం పొందవచ్చు. కాల్షియం బలమైన ఎముకలు, పటిష్టమైన దంతాలకు చాలా ముఖ్యమైన ఖనిజం. మీరు పాలు తీసుకోనప్పుడు కూడా పండ్ల ద్వారా కాల్షియం మోతాదు పొందవచ్చు. ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అంజీర్
అంజీర్ పండు కాల్షియం అధికంగా కలిగి ఉంటుంది. ఇందులో పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి, ముఖ్యంగా ఎముకలకు మేలు చేసే పండ్లలో ఒకటిగా గుర్తించబడింది.
కివి పండు
కివి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఇది చర్మానికి ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయపడుతుంది. కివి పండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కాల్షియం మోతాదు పెరుగుతుంది.
బొప్పాయి
బొప్పాయి 30 మి.గ్రా కాల్షియంను అందిస్తుంది. అలాగే ఇది విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఖనిజాలు కూడా కలిగి ఉంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ఈ పండు కంటి ఆరోగ్యానికి కూడా బలాన్ని ఇస్తుంది.
బ్లాక్‌బెర్రీస్
బ్లాక్‌బెర్రీస్ లో అర కప్పులో దాదాపు 42 మి.గ్రా కాల్షియం ఉంటుంది. ఇది కాల్షియం పుష్కలంగా ఉండే పండ్లలో ఒకటిగా గుర్తించబడింది. ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
రాస్ బెర్రీస్
రాస్ బెర్రీస్ కూడా కాల్షియం అధికంగా ఉన్న పండ్లలో ఒకటిగా చెప్పవచ్చు. అర కప్పులో దాదాపు 32 మి.గ్రా కాల్షియం ఉంటుంది. ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం మోతాదు పెరుగుతుంది.
నేరేడు పండు
నేరేడు పండు పొటాషియం, విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో పాటు ఇది కాల్షియం పండ్లలో కూడా ఒకటిగా గుర్తించబడింది. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
నిమ్మకాయ
నిమ్మకాయలో 26 మి.గ్రా కాల్షియం ఉంటుంది. అలాగే విటమిన్ సి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి కాల్షియం పండు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నారింజ పండు
నారింజ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాముల నారింజలో దాదాపు 43 మి.గ్రా కాల్షియం ఉంటుంది. రోజువారీ ఆహారంలో నారింజలను చేర్చుకోవడం వల్ల శరీరానికి కాల్షియం మోతాదును అందిస్తుంది.