Gastric Pain: గ్యాస్ట్రిక్ నొప్పి తో బాధపడుతున్నారా.. ప్రథమ చికిత్స తీసుకోండి ఇలా

Gastric Pain: ప్రస్తుతం జనరేషన్ లో మనం తినే తిండికి గ్యాస్టిక్ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఒకొక్కసారి గ్యాస్ట్రిక్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియకుండా..

Gastric Pain: గ్యాస్ట్రిక్ నొప్పి తో బాధపడుతున్నారా.. ప్రథమ చికిత్స తీసుకోండి ఇలా
Gastric Pain

Edited By: Surya Kala

Updated on: Jul 09, 2021 | 4:55 PM

Gastric Pain: ప్రస్తుతం జనరేషన్ లో మనం తినే తిండికి గ్యాస్టిక్ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఒకొక్కసారి గ్యాస్ట్రిక్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే.. అపుడు గుండె నొప్పి వచ్చిందని అనేటంత బాధను కలిగిస్తుంది. దీంతో ప్రథమ చికిత్స ఎలా చేయాలనే విషయంలో సందిగ్ధం ఏర్పడుతుంది. గ్యాస్ నొప్పి కూడా ఛాతీ లో వస్తుంది. అందుకనే గుండె నొప్పి అని భయపడతారు.. అయితే కొంచెం డీప్ గా అబ్జర్వవ్ చేస్తే రెడింటికి తేడా ఈజీగా గుర్తు పట్టవచ్చు. ఈరోజు గ్యాస్టిక్ పెయిన్ కి , గుండె నొప్పికి తేడా తెలుసుకుందాం..

గుండె నొప్పి అయితే ఛాతీ తో పాటు ఎడమ చెయ్యి ఎడమ వైపు బ్యాక్ అంతా ఒకేసారి నొప్పి ఉంటుంది. మనం భరించలేని బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు.. నీరసంగా మగతగా బాగా నిద్రపోవాలి అనిపించేలా ఉంటుంది. ఇక చెమటలు ఎక్కువగా పడతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే.. గుండె నొప్పి సూచన అనుమానించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

గ్యాస్ నొప్పి వస్తే.. ఛాతీ తో పాటు. ఒకొక్కసారి ఒక్కో దగ్గర పెయిన్ అనిపిస్తుంది. ముందుకు వంగినప్పుడు వంగి నప్పుడు కూర్చున్నప్పుడు ఛాతీ లో నొప్పి అనిపిస్తే.. అదే నొప్పి పడుకున్న సమయంలో వీపు భాగంలో ఉన్నట్లు అనిపించి విపరీతమైన బాధను కలిగిస్తుంది. ఎందుకంటే గ్యాస్ పడుకున్నప్పుడు వెనక్కి వెళ్తుంది. అందుకని కూర్చున్న సమయంలో ఒకలా పడుకుంటే ఒకలా గ్యాస్ట్రిక్ సమస్య ఇబ్బంది పెడుతుంది. అదే గుండె నొప్పి అయితే లేచినా కూర్చున్నా, పడుకున్నా ఒకే చోట పెయిన్ అనిపిస్తుంది.

గ్యాస్ నొప్పికి ప్రథమ చికిత్స గా వేడి నీటిలో తేనే వేసుకుని తాగడం లేదా రెండు గ్లాసుల మజ్జిగను వెంటనే తాగడం.. దీంతో తేన్పుల రూపంలో గ్యాస్ బయటకు వచ్చి రిలీజ్ అనిపిస్తుంది. గ్యాస్టిక్ సమస్య ఉన్నవారు పులుసులు పప్పులు మసాలాలు కొన్ని రోజులు తినడం మానెయ్యాలి. అదే సమయంలో ఆహారంలో పీచు పదార్ధాలు ఉండేవారిని చేర్చుకోవాలి. రోజూ ఉదయమే గోరు వెచ్చని తాగడం కూడా గ్యాస్ ప్రాబ్లెమ్ ను తగ్గిస్తుంది. అదే డాక్టర్ దగ్గరకు వెళ్ళితే..పొద్దున్నే పరగడుపున ఏమీ తినకుండా వేసుకోమని ఒక టాబ్లెట్ ఇస్తారు. కానీ ఎక్కువగా మందులు వాడడం మంచిది కాదు.

Also Read:   ఊబకాయంతో నడుం, కీళ్ల నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్నారా . సింపుల్ చిట్కాలు పాటించండి