Diet For Weight Loss: ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనిని వ్యాధిగా పరిగణించనప్పటికీ.. ఇది అలాంటి సమస్యేనని పేర్కొంటున్నారు నిపుణులు. స్థూలకాయం శరీరంలోని అనేక సమస్యలకు కారణం అవుతుంది. అందుకే ఊబకాయాన్ని వ్యాధుల నిలయం అంటారు నిపుణులు. మీరు కూడా అధిక బరువు కలిగి ఉంటే.. మీరు దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. తద్వారా శరీరానికి ఇతర వ్యాధుల ప్రమాదం నుంచి రక్షణ లభిస్తుంది. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ముందుగా మీరు చెడు ఆహారాన్ని నియంత్రించుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే, ఒక వ్యక్తి తన బరువును చాలా వరకు నియంత్రించకోవచ్చు. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన విషయాలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఆహారంలో చేర్చుకోదగిన 4 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. వీటిద్వారా మీ బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
పరగడుపున వీటిని తినండి
వెల్లుల్లి: ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో, రెండు వెల్లుల్లి రెబ్బలను నోట్లో వేసుకుని తినండి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ పిండుకుని తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల మీ బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. వెల్లుల్లి తిన్న తర్వాత దాదాపు గంట వరకు ఏమీ తినకూడదు.
యాపిల్: రోజూ ఒక యాపిల్ తింటే అన్ని సమస్యలూ దూరమవుతాయని అంటారు. అటువంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే.. ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుతుంది. యాపిల్స్‌లో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
అల్పాహారంలో వీటిని తినండి..
గోధుమరవ్వ: ఉదయం పూట అల్పాహారంలో నూనె పదార్థాలు పూరీలు, పరాటాలు లాంటివి తినడం అస్సలు మంచిది కాదు. ఆరోగ్యంతోపాటు రోజంతా శక్తినిచ్చే వాటిని తినాలని పేర్కొంటున్నారు. బరువు తగ్గాలనుకుంటే అల్పాహారంలో తృణధాన్యాలను, గొధుమరవ్వ లాంటివి తీసుకోవాలి. వీటిలో చాలా ప్రోటీన్ ఉంటుంది. తినడానికి కూడా తేలికగా ఉంటుంది. దీంతో బరువు తగ్గొచ్చు.
మొలకలు: ఉదయపు అల్పాహారంలో మొలకలు కూడా మంచి ఎంపిక. ఇందులో ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది తిన్నాక చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఇది మీ శరీరానికి బలంతోపాటు శక్తిని ఇస్తుంది. అలాగే బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇడ్లీ: ఉదయం అల్పాహారానికి ఇడ్లీ మంచి ఎంపిక. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇడ్లీ మంచిది. దీంతో కడుపు నిండటంతోపాటు మీకు తక్షణ శక్తి లభిస్తుంది.
ఉప్మా: బరువు తగ్గాలనుకునే వారికి ఉప్మా కూడా చాలా మంచిది. అల్పాహారంలో దీన్ని తినడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఈ జాగ్రత్తలు అవసరం..
ఈ డైటింగ్ విషయాలన్నీ పాటించినప్పటికీ.. మీరు కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. తద్వారా మీ శరీరం జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఉదయం ఒక గంట పాటు వ్యాయామం చేయడం మంచిది. దీంతోపాటు రాత్రి భోజనం చేసిన తర్వాత అరగంట పాటు నడవండి. ఇది కాకుండా బయటి ఆహారం, ఎక్కువ ఉప్పు, కారంగా ఉన్న ఆహారాన్ని పూర్తిగా నివారించండి. స్వీట్లు తినడం మానుకోండి. పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి