Diabetic: మధుమేమం వ్యాధి ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తోంది. డయాబెటిస్ రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. ఇప్పుడున్న కాలంలో ఇంటింటికి మధుమేహం వ్యాధిగ్రస్తులుంటున్నారు. జీవనశైలి, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుని రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుకుంటే ఒక్కకాలం జీవించవచ్చు. లేకపోతే శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. షుగర్ లెవల్స్ గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, స్ట్రోక్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్‌ను తగినంతగా ఉత్పత్తి కానప్పుడు మధుమేహం బారిన పడతారు.
డయాబెటిస్ వచ్చిన తర్వాత అదుపులో లేకుంటే రక్తనాళాలు సైతం దెబ్బతింటాయి. కొందరికి తెలియకుండానే రక్తంలో షుగర్స్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ముందస్తుగా సంకేతాలు కనిపిస్తున్నా పెద్దగా పట్టించుకోరు. నిర్లక్ష్యం చేస్తే మధుమేహం మరింతగా ముగిరిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
అలసట రావడం: రక్తంలో అధికంగా గ్లూకోజ్ ఉంటే అదనంగా శక్తి వస్తుందని భావించవద్దు. శరీరంలో గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉన్నప్పటికీ, శక్తిగా మార్చుకోలేని స్థితి. దీంతో శక్తి సరిపోక అలసట వస్తుంటుంది.
అధిక మూత్ర విసర్జన: డయాబెటిస్ ఉన్నవారు మూత్ర పిండాలు రక్తంలో అధికంగా షుగర్‌ను వడకట్టవు. కానీ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్‌ను బయటకు పంపే ప్రయత్నం జరుగుతుంది. దీంతో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది.
బరువు తగ్గడం: మధుమేహం ఉన్నవాళ్లకు ఆకలి పెరుగుతుంది. ఇదే సమయంలో బరువు తగ్గిపోయారంటే మధుమేహం సంకేతంగా భావించాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉన్నా.. ఇన్సులిన్ లేని కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయి.
కంటి చూపుపై ప్రభావం: మధుమేహం ఉన్నవారికి కంటి చూపు మందగిస్తుంటుంది. కంటి వెనుక భాగంలో ఉండే రక్తనాళాల పరిమాణం పెరుగుతుంది. దీంతో కంటి చూపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
తిమ్మిర్లు రావడం : షుగర్స్ లెవల్స్ పెరుగుతుండటంతో కాళ్లు, చేతుల్లో అధికంగా తిమ్మిరిలు వస్తాయి. దీంతో రక్త ప్రవాహానికి కూడా అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా తిమ్మిరిలు, జలదరింపులు రావడం మొదలవుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి