Diabetic Control Tips: మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలతో మీ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించండి..

|

Dec 06, 2022 | 4:50 PM

డయాబెటీస్‌తో బాధపడేవారికి ఏది తినాలన్నా సమస్యాత్మకంగానే ఉంటుంది. ఇంకా ఆ ఆరోగ్య సమస్యను అధిగమించడంలో కూడా ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం మనం..

Diabetic Control Tips: మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలతో మీ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించండి..
Diabetes
Follow us on

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. చిన్న వయసులోనే బీపీ, డయాబెటీస్, అల్సర్, ఎసిడిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారికి ఏది తినాలన్నా సమస్యాత్మకంగానే ఉంటుంది. ఇంకా ఆ ఆరోగ్య సమస్యను అధిగమించడంలో కూడా ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చలికాలంలో ఉన్నాం. ఈ కాలంలో ఆరోగ్యానికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు తప్పనిసరిగా ఆహార నియమాలను పాటించి తీరాలి. ఇంకా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

డయాబెటీస్ సమస్యను ఎదుర్కొనేవారు శీతాకాలంలో కొన్నిరకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటు మన అదుపులోనే ఉంటుంది. నిజమే.. అయితే డయాబెటిక్ పేషెంట్లు చలికాలంలో తినదగిన కూరగాయలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టర్నిప్ లేదా ఎర్ర ముల్లంగి: డయాబెటిక్ పేషెంట్లు తినదగిన కూరగాయలలో టర్నిప్ లేదా ఎర్ర ముల్లంగి కూడా ఒకటి. ఇందులో చాలా తక్కువ మొత్తంలో కార్బ్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది. ఈ కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీ ఆహారంలో టర్నిప్‌ను ఖచ్చితంగా చేర్చుకోండి.

ఇవి కూడా చదవండి

బీట్‌రూట్: బీట్‌రూట్ మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇందులో బీటాలైన్, నియో బెటానిన్ ఉండటమే అందుకు కారణం. ఇవి బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడతాయి.

క్యారెట్: క్యారెట్ శీతాకాలపు మార్కెట్‌లో ఎక్కువగా లభించే కూరగాయ. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని కూరగాయలు, సలాడ్‌లు, జ్యూస్‌ల రూపంలో డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవచ్చు.

ముల్లంగి: డయాబెటిక్ సమస్యను ఎదుర్కొనే వారికి సహకరించే అనేక లక్షణాలు ముల్లంగిలో కనిపిస్తాయి. దీని కారణంగా ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కాబట్టి మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీరు రోజూ ముల్లంగిని తినవచ్చు.

ఇంకా డయాబెటిస్ పేషెంట్లు తీసుకోదగిన ఇతర పదార్థాలు..

దాల్చిన చెక్క పాలు: వంటగదిలో ఎప్పుడూ ఉండే దాల్చిన చెక్క ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. మసాలాగా, ఆహారం రుచిని పెంచే దాల్చిన చెక్కలో పొటాషియం, విటమిన్లు, కాల్షియం, ఐరన్, అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పాలల్లో దాల్చిన చెక్క పొడిని రోజూ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

పసుపు పాలు: ఔషధ గుణాలున్న పసుపును పురాతన కాలం నుంచి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, డయాబెటిక్ పేషెంట్లు దీన్ని ప్రతిరోజూ తినాలని సూచించారు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఎలాంటి వ్యాధినైనా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనితో పాటు, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నిద్రపోయే ముందు పసుపు పాలు తాగాలి.

బాదం పాలు: బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు మన నుండి దూరంగా ఉండవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే తక్కువ మొత్తంలో సోడియం కారణంగా, అధిక రక్తపోటు ఉన్న రోగులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బాదం పాలు రోజూ తాగాలి. దీనితో పాటు 6 నుండి 7 నానబెట్టిన బాదంపప్పులను కూడా ఉదయాన్నే తినాలి.

(గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..