Diabetic Patient: షుగర్ ఉన్నవారు బీట్‌రూట్ తింటే బెటర్.. ఈ 4 సమస్యలకి చక్కటి పరిష్కారం..

Diabetic Patient: బీట్‌రూట్‌లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వైద్యులు తినమని సిఫార్సు చేస్తారు. ఇందులో ఐరన్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా

Diabetic Patient: షుగర్ ఉన్నవారు బీట్‌రూట్ తింటే బెటర్.. ఈ 4 సమస్యలకి చక్కటి పరిష్కారం..
Beetroot

Updated on: Feb 12, 2022 | 1:35 PM

Diabetic Patient: బీట్‌రూట్‌లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వైద్యులు తినమని సిఫార్సు చేస్తారు. ఇందులో ఐరన్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు బీట్‌రూట్‌ ప్రయోజనం చేకూరుస్తుంది. బీట్‌రూట్ రుచి తియ్యగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తినాలా వద్దా అని అయోమయంలో ఉంటారు. కానీ వారు బీట్‌రూట్‌ తింటే నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌రూట్‌లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

1. అధిక రక్తపోటును తగ్గిస్తుంది

డయాబెటీస్‌ పేషెంట్లు తరచుగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు. బీట్‌రూట్ తినడం లేదా దాని రసం తాగడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.

2. ఉదర సమస్యల నుంచి ఉపశమనం

డయాబెటిక్ రోగులు భోజనానికి ముందు బీట్‌రూట్ తినాలి. శరీరానికి సహజ చక్కెర లభించడమే కాకుండా జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

3. ఇతర వ్యాధుల నుంచి రక్షణ

మధుమేహం భారతదేశంలో ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది మూత్రపిండాలు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన బీట్‌రూట్‌ను తింటే మధుమేహం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి.

4. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది

బీట్‌రూట్ సహజ చక్కెరను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మీ శరీరానికి హాని కలిగించదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం తినడానికి ముందు బీట్‌రూట్ తీసుకోవాలి. ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అంతేకాక శక్తిని ఎక్కువగా అందిస్తుంది. పేషెంట్లు హుషారుగా ఉంటారు.

Hug Day 2022: కౌగిలింత వల్ల లవ్ హార్మోన్ పెరుగుతుంది.. శరీరంలో ఈ మార్పులు..?

ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు..?

100 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?