శరీరంలో షుగర్ లెవెల్ పెరిగినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. దీని వల్ల డెర్మోపతి (Diabetic Dermopathy) వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది డయాబెటిస్‌లో సంభవించే ఒక రకమైన చర్మ వ్యాధి. ఈ వ్యాధిలో, శరీరంలోని అనేక భాగాలలో చిన్న చిన్న మొటిమలు, గుండ్రటి పుండ్లు, గాయాలు కనిపిస్తాయి. ఇవి మడమ భాగాలపై.. అంటే కాళ్ళ పైభాగాలు.. ముఖంపై కనిపిస్తాయి. ఈ సమస్యలను చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. అందువల్ల ఇలాంటి వాటిని తేలికగా తీసుకోవద్దని, ఇవి రక్తంలో చక్కెర పరిణామం పెరిగినప్పుడు కలిగే సంకేతాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు చర్మంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకోండి..
చక్కెర స్థాయి పెరిగినప్పుడు, పాదాల పైభాగాల చర్మంపై చిన్న నలుపు, గోధుమ రంగులో గాయాలు ఏర్పడతాయి. అలాంటి సమస్య ఉంటే, వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇవి డెర్మోపతి సంకేతాలు. చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.
ఎటువంటి కారణం లేకుండా చర్మంపై చిన్న చిన్న మొటిమలు కనిపిస్తే.. ఇవి రక్తంలో అధిక చక్కెరను సూచిస్తాయి. అటువంటి పరిస్థితిలో, వెంటనే ఆరోగ్య నిపుణుల నుంచి సహాయం తీసుకోవాలి. తద్వారా ఈ సమస్యను వీలైనంత త్వరగా సరిదిద్దవచ్చు.
శరీరంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, చర్మంపై గాయాలు, పుండ్లు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ గాయాలు త్వరగా మానవు… దీని కోసం డాక్టర్ సహాయం తీసుకోవాలి.. ఎందుకంటే ఇవి డయాబెటిస్ సంకేతాలు కావచ్చు.
చర్మంపై ఊదా, ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగు గుర్తులు (రాషెస్) కనిపిస్తే, దానిని విస్మరించకుండా ఉండాలి. ఈ సంకేతాలు తీవ్రంగా మారుతాయి. ఇది అధిక రక్తంలో చక్కెర స్థాయికి సంకేతం కూడా కావచ్చు.
మీరు మళ్లీ మళ్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, అది రక్తంలో చక్కెర స్థాయిని పెంచడాన్ని సూచిస్తుంది. దీని కారణంగా, చర్మంపై దురద సంభవించవచ్చు. ఇది చాలా కాలం పాటు జరిగితే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..