కొత్తిమీరతో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీర అనేది ప్రతి వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఈ కొత్తమీరను క్రీ.పూ. 5000 సంవత్సరాల క్రితం నుంచే ఉపయోగిస్తున్నట్లు చెబుతుంటారు. దీనిని మొదట ఇటలీలో ఉపయోగించినట్లు తెలుస్తోంది. వంటలలో విస్తృతంగా ఉపయోగించే కొత్తిమీర భారతదేశానికి చెందినది కాదు. అయితే దనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
థైరాయిడ్‌ను నియంత్రించడంలో దనియాలు గానీ, కొత్తిమీర గానీ ఎంతగానో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగడం వల్ల థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. థైరాయిడ్ సమస్యలు, కఫం సమస్యలను నివారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దనియాలలో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్లు ఏ,సీ, కే ఉన్నాయి.
దనియాల నీరు జీర్ణక్రియకు సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నీటిలో నానబెట్టిన దనియాలు జీర్ణశయ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఉబ్బరం సమస్య తగ్గుతుంది. పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, దనియాలు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉండటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
దనియాలలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కెమికల్స్ శరీరంలో మంటను తగ్గించగలవు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేటరీ సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది. దనియ గింజలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని రక్షించడానికి పని చేస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
దనియాలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బహిష్టు సమయంలో దనియాల నీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, కడుపు తిమ్మిరి తగ్గుతుంది. కొత్తిమీర చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కొత్తిమీర గింజల్లోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దనియాలు సహజంగా విశ్రాంతినిస్తాయి. దనియాల నీటితో మీ రోజును ప్రారంభించడం వలన టెన్షన్, ఆందోళన తగ్గుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి