Health Tips: ప్రయాణాల్లో వాంతులు వేధిస్తున్నాయా.. తులసి ఆకులతో అద్భుత ప్రయోజనాలు

|

Jul 04, 2022 | 5:13 AM

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రయాణం (Travel) చేయాల్సి ఉంటుంది. ఉద్యోగవ్యాపారాల కోసం వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణం అనేది మంచి అనుభూతి కలిగించే విషయమే అయినా కొందరిలో...

Health Tips: ప్రయాణాల్లో వాంతులు వేధిస్తున్నాయా.. తులసి ఆకులతో అద్భుత ప్రయోజనాలు
Vomiting Problems At Travel
Follow us on

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రయాణం (Travel) చేయాల్సి ఉంటుంది. ఉద్యోగవ్యాపారాల కోసం వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణం అనేది మంచి అనుభూతి కలిగించే విషయమే అయినా కొందరిలో మాత్రం అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. కొందరికి కారు, రైలు, విమానం ఇలా ఏ వాహనం ఎక్కినా కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. వాంతులు (Vomiting) అవుతుంటాయి. అలాంటి సమస్యతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం కూర్చునే సీటు సౌకర్యంగా లేకపోతే వాంతులు వస్తున్నాయన్న భావన కలుగుతుంది. కారులో ముందు సీటులో కూర్చున్నప్పటి కన్నా వెనక కూర్చుంటే వాంతయ్యే అవకాశమెక్కువ. బస్సులోనూ వీలైనంతవరకు ముందు వరుసలో కూర్చోవటం మంచిది. రైలులో అయితే కిటికీ పక్కన కూర్చుంటే మంచిది. ప్రయాణాలలో పుస్తకాలు చదవడం కొందరికి అలవాటు. కానీ అలా చేయడం వల్ల వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. అటువంటప్పుడు పుస్తకాల వంటివి చదవకుండా కిటికీలోంచి దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. దీంతో దృష్టి మళ్లి వాంతులు వస్తున్నాయన్న ఫీలింగ్ తగ్గుతుంది.

ప్రయాణాలు చేసేముందు కడుపు నిండా ఆహారం తినవద్దు. వేపుళ్లు, మసాలా, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాల జోలికి వెళ్లొద్దు. ఇవి జీర్ణాశయంలో యాసిడ్ లెవెల్స్ ను పెంచి కడుపులో తిప్పుతున్న భావనను కలిగించి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇష్టమైన పాటలు వినడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తులసి ఆకులు నమలటం వల్ల వాంతి భావన తగ్గుతుంది. కారులో వెళ్లేవారు అప్పుడప్పుడు విరామం తీసుకోవటం మంచిది. కిందికి దిగి కాసేపు నడవటం ఉత్తమం. ఇలాంటి లక్షణాలతో బాధపడేవారు ప్రయాణాలు చేసేముందు డాక్టర్‌ను సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇవి కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఇందులోని అంశాలను పాటించాలనుకుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.