Hair Tips at Home: ఈ హోమ్ రెమిడీస్ తో హెయిర్ ఫాల్ ను నెల రోజుల్లో తగ్గించుకోండి!

|

Sep 24, 2023 | 10:41 AM

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం కారణంగా చర్మం, జుట్టుపై కూడా ఎఫెక్ట్ పడుతున్నాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల జుట్టుకు అందాల్సిన పోషకాలు అందడం లేదు. దీంతో జుట్టు బలహీనమై, పొడి పారిపోయి రాలిపోతుంది. ఆడవారికైనా, మగవారికైనా జుట్టే ఆకర్షణీయంగా నిలుస్తుంది. రకరకాల హెయిర్ స్టైల్స్ వల్లనే జుట్టు మరింత అందాన్ని ఇస్తుంది. అయితే ఇప్పుడున్న కాలంలో..

Hair Tips at Home: ఈ హోమ్ రెమిడీస్ తో హెయిర్ ఫాల్ ను నెల రోజుల్లో తగ్గించుకోండి!
Curry Leaves For Hair
Follow us on

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం కారణంగా చర్మం, జుట్టుపై కూడా ఎఫెక్ట్ పడుతున్నాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల జుట్టుకు అందాల్సిన పోషకాలు అందడం లేదు. దీంతో జుట్టు బలహీనమై, పొడి పారిపోయి రాలిపోతుంది. ఆడవారికైనా, మగవారికైనా జుట్టే ఆకర్షణీయంగా నిలుస్తుంది. రకరకాల హెయిర్ స్టైల్స్ వల్లనే జుట్టు మరింత అందాన్ని ఇస్తుంది. అయితే ఇప్పుడున్న కాలంలో జుట్టు పెరిగే సంగతి పక్కన పెడితే.. ఉన్న జుట్టు రాలకుండా కాపాడుకోవడమే కష్టంగా మారింది.

దానికి తోడు ఇప్పుడు వాడుతున్న షాంపూలు, కండీషనర్స్ జుట్టుకు మరింత నష్టాన్ని ఇస్తున్నాయి. దాంతో మూడు పదుల వయసులోనే బట్ట తల, జుట్టు నెరిసి పోవడం జరుగుతుంది. అలాగే గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల కూడా మనకు తెలియకుండానే ఒత్తిడికి గురై.. జుట్టు అధికంగా రాలిపోతంది. దీంతో చాలా మంది వైద్యులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీని వల్ల బాడీపై సైడ్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి. అకారణంగా బరువు పెరుగుతున్నారు. ఇలా కాకుండా ఇంట్లోనే కొన్ని రకాల నేచురల్ టిప్స్ పాటించడం వల్ల కూడా జుట్టు కాపాడుకోవచ్చు. మరి ఏం చేయాలో చూద్దాం.

కరివేపాకు – కలబంద:

ఇవి కూడా చదవండి

ఒక మిక్సీ జార్ లో గుప్పెడు కరివేపాకు, కొద్దిగా కలబంద గుజ్జు, రెండు స్పూన్ల బియ్యం, కొబ్బరి నూనె, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా సిద్ధం చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించాలి. బాగా ఆరిపోయాక షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవడమే.

కొబ్బరి నూనె – మందార పువ్వులు:

ఒక గిన్నెలో పావు లీటర్ కోకోనెట్ ఆయిల్ వేసి.. అందులో బాగా ఎండిన మందార పువ్వులు, పావు కప్పు కరివేపాకు, కొద్దిగా గోరింటాకు, కొద్దిగా తులసి ఆకులు, కొద్దిగా ముద్ద కర్పూరం వేసి స్మెల్ పోయేంత వరకూ మరిగించుకోవాలి. దీన్ని ఒక గాజు సీసాలోకి తీసుకుని జుట్టుకు రాసుకుంటూ ఉండాలి. ఈ నూనె రాసుకోవడం వల్ల జుట్టు పెరగడంతో పాటు, చుండ్రు ఉన్నా కూడా పోతుంది.

జుట్టుకు కండీషనర్ లాగా అవిసె గింజలు:

జుట్టును షైనీగా, ఒత్తుగా పెరిగేలా చేయాలంటే.. అవిసె గింజలు బాగా పని చేస్తాయి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, రెండు స్పూన్ల అవిసె గింజలను వేసుకుని.. జిగురు పోయేంత వరకూ మరిగించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక జుట్టుకు బాగా పట్టించాలి. ఆరిపోయాక చల్లని నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. జుట్టుకు వేరే కండీషనర్స్ అవసరం లేదు. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.