Thyroid: కరోనా వైరస్‌ కారణంగా థైరాయిడ్‌పై ప్రభావం.. హర్మోన్లలో మార్పులు.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య నిపుణులు

|

Feb 19, 2021 | 2:46 PM

Thyroid: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా వైరస్‌ పూర్తి స్థాయిలో కట్టడి రాకలేకముందే కొత్తగా యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాప్తి ...

Thyroid: కరోనా వైరస్‌ కారణంగా థైరాయిడ్‌పై ప్రభావం.. హర్మోన్లలో మార్పులు.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య నిపుణులు
Follow us on

Thyroid: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా వైరస్‌ పూర్తి స్థాయిలో కట్టడి రాకలేకముందే కొత్తగా యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. దీంతో జనాల్లో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఎండ్రోక్రైనాలజీ అండ్‌ మెటాబాలిజంలో ప్రచురించిన కథనం ప్రకారం.. థైరాయిడ్‌ వ్యాధి ఉన్నవారు వారికి కరోనా సోకిన తర్వాత కొత్త సమస్యలు వస్తున్నట్లు తేలింది. వైరస్‌ థైరాయిడ్‌ లేదా థైరాయిడ్‌ అనంతరం సమస్య అయిన సబ్‌ అక్యూట్‌ థైరాయిడైటిస్‌ వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనిపై వైద్యులు స్పందిస్తూ కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత రోగుల్లో లక్షణాలు పరిశీలించగా, థైరాయిడ్‌ హర్మోన్‌ స్థాయిలో మార్పులు వస్తున్నాయిన అన్నారు. కోవిడ్‌-19 ఇందుకు కారణమైనట్లు స్పష్టం చేశారు. ఈ అదనపు క్లినికల్‌ మేని ఫెస్టేషన్‌ వల్ల కొత్త సమస్య వచ్చే అవకాశమున్నందున థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనినే పోస్ట్‌ వైరల్‌ థైరాయిడైటిస్‌ అని కూడా పిలుస్తారు. థైరాయిడ్‌ గ్రంథిలో మంట రావడం,శ్వాస కోశ ఇన్ఫెక్షన్ల వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం లాంటివి ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు.

ఈ వ్యాధికి కారకాలు, కారణాలేంటి?

సబ్ అక్యూట్ థైరాయిడైటిస్ ప్రధాన లక్షణం క్రమంగా లేదా అకస్మాత్తుగా థైరాయిడ్ గ్రంథిలో నొప్పి రావడం, అలాగే కొన్ని వారాల పాటు ఉండటం జరుగుతుంది. ఇది కొన్ని వారాలు లేదా నెలలపాటు ఉండే అవకాశముంది. థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడం వల్ల దడగా అనిపించడం, క్రమంగా గుండె వేగం పెరగడం, వేడి తట్టుకోలేకపోవడం, హృదయ స్పందన రేటులో వ్యత్యాసం వంటి లక్షణాలు వ్యాధి మొదట్లోనే కనిపిస్తాయి. అలాగే అలసట, మలబద్దకం లేదా జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడి సాధారణ స్థాయికి వస్తుంది. అయితే దీన్ని అంత తేలికగా తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో మధ్య వయసు గలవారికి వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల థైరాయిడైటిస్ వచ్చే అవకాశాలుంటాయి.

థైరాయిడైటిస్‌ లక్షణాలు :

-వేడి అసహనం
-బరువు తగ్గడం
-మెడముందు భాగంలో నొప్పి
-విరేచనాలు
-ప్రకంపనలు
-థైరాయిడ్ గ్రంథిపై ఒత్తిడి పడినప్పుడు సున్నితంగా మారడం
-జ్వరం
-బలహీనంగా ఉండటం, అలసట
-భయం
-చెమట
-దడ, ఆందోళన లాంటి లక్షణాలు ఉన్నాయి.